Salman Khan: అనంత్ అంబానీకి సల్మాన్ ఖాన్ స్పెషల్ గిఫ్ట్ ?

అనంత్ అంబానీకి సల్మాన్ ఖాన్ స్పెషల్ గిఫ్ట్ ?

Salman Khan: భారత కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ల ప్రీ వెడ్డిండ్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. మార్చి 1 నుండి 3 వరకు గుజరాత్ లోని జామ్ నగర్ లో నిర్వహించిన ఈ వేడుకల్లో దేశ, విదేశాల నుండి వ్యాపార, రాజకీయ, సినీ ప్రముఖులు పాల్గొన్నారు. మూడు రోజుల పాటు సెలబ్రిటీలు డ్యాన్సులు వేస్తూ వేడుకలను బాగా ఎంజాయ్ చేసారు. ఈ నేపథ్యంలో హాలీవుడ్ పాప్ సింగర్ రిహన్నాతో పాటు అమీర్ ఖాన్, షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్(Salman Khan) లు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి నాటు నాటు స్టెప్ వేసారు. కేవలం ప్రీవెడ్డింగ్ కోసం అంబానీ వెయ్యి కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్… కాబోయే జంటకు ఇచ్చిన గిఫ్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

Salman Khan Got Special Gift from Anant Ambani..

స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ అంబానీ ఫ్యామిలీకి చాలా క్లోజ్‌. అనంత్‌ అంబానీ- సల్మాన్‌ మధ్య ఎప్పటినుంచో మంచి అనుబంధం ఉంది. అందుకే ప్రీ వెడ్డింగ్‌ వేడుకల్లో నాటు నాటు పాట స్టెప్ లో ఉర్రూతలూగించిన సల్మాన్ ఖాన్…. కొంత జంట కోసం ప్రత్యేకంగా ఓ గిఫ్ట్‌ పట్టుకెళ్లాడట. అనంత్‌ కోసం ప్రత్యేకంగా ఓ వాచ్‌ తయారు చేయించాడట. దాని విలువ కోట్లల్లో ఉంటుందని తెలుస్తోంది. రాధిక మర్చంట్‌ కు కూడా డైమండ్‌ ఇయర్‌ రింగ్స్‌ బహుమతిగా ఇచ్చాడట. ఇది చూసిన కొందరు అంబానీకి ఆ గిఫ్ట్స్‌ ఏం సరిపోతాయని సెటైర్లు వేస్తున్నారు. అయినా అంబానీకి గిఫ్ట్‌ ఇవ్వాలంటే ఆస్తులు అమ్ముకోవాలని కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా ఇలా బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటే వారి మధ్య స్నేహం మరింత బలంగా మారుతుందని అభిప్రాయపడుతున్నారు.

Also Read : Lambasingi : ఒక కొత్త లవ్ స్టోరీ గా రానున్న లంబసింగి’ సినిమా..వైరల్ అవుతున్న ట్రైలర్

Ananth AmbaniRadhika MarchantSalman Khan
Comments (0)
Add Comment