Sikandar Movie : సల్మాన్ ‘సికందర్’ సినిమాలో గెస్ట్ రోల్ కి మరో అందాల తార

ఈ వార్త ‘సికిందర్’ సినిమాని వార్తలలో ఉంచుతూ, సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యేలా చేస్తోంది...

Sikandar : బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌, తమిళ డైరెక్టర్‌ ఏ. ఆర్‌.మురుగుదాస్‌ కలయికలో తెరకెక్కుతోన్న చిత్రం ‘సికందర్‌’. సత్యరాజ్‌, ప్రతీక్‌ బబ్బర్‌ కీలక పాత్రలు పోషిస్తుండగా.. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్నారు. దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్‌తో సాజిద్‌ నడియాడ్‌వాలా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. అయితే, ఈ సినిమాలోని ఓ కీలక పాత్రలో నటించడానికి కాజల్‌ అగర్వాల్‌ ఓకే చెప్పిందని, ప్రస్తుతం ఆమె సెట్స్‌లోకి అడుగుపెట్టిందనేలా టాక్ వినబడుతోంది. ఇదిలా ఉంటే.

Sikandar Movie Updates

రెండు రొమాంటిక్ సాంగ్స్ షూట్ చేసే నిమిత్తం నేషనల్ క్రష్ రష్మిక మందన్నాతో కలిసి సల్మాన్ ఖాన్ యూరప్‌కు వెళ్తున్నారనేలా బాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్త ‘సికిందర్(Sikandar)’ సినిమాని వార్తలలో ఉంచుతూ, సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యేలా చేస్తోంది. ఈ మధ్య రష్మిక మందన్నా.. చిన్న యాక్సిడెంట్‌కి గురై, షూటింగ్స్‌కి దూరంగా ఉన్నట్లుగా తెలిపింది. ఇప్పుడామె కోలుకుని.. షూటింగ్స్‌తో బిజీ అవుతోంది. ఈ నేపథ్యంలో సల్మాన్, రష్మికలపై రొమాంటిక్ సాంగ్స్‌ని యూరప్‌లో చిత్రీకరించేందుకు అన్నీ సిద్ధం చేశారని, టీమ్ ఇప్పటికే యూరప్ చేరుకుందనేలా బీటౌన్‌లో వినిపిస్తుంది. ఈ సాంగ్స్‌కి ఓ ప్రత్యేకత కూడా ఉండబోతుందట. అదేంటనేది త్వరలోనే మేకర్స్ ప్రకటించనున్నారు. ప్రీతమ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. పాపులర్ యాక్టర్ సత్యరాజ్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాను ఎప్పటిలానే మురుగదాస్ సమాజంలోని అవినీతి, నేరాలకు వ్యతిరేకంగా పోరాడే వ్యక్తి కథ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ఈద్‌ కానుకగా 2025లో విడుదల చేయనున్నారు.

Also Read : Jayam Ravi Divorce : డివోర్స్ మీటర్ పై రివర్స్ అయిన జయం రవి భార్య

CinemaKajal AggarwalSikandarTrendingUpdates
Comments (0)
Add Comment