Salman Khan: అట్లీ దర్శకత్వంలో కమల్‌ – సల్మాన్‌ సినిమా !

అట్లీ దర్శకత్వంలో కమల్‌ - సల్మాన్‌ సినిమా !

Salman Khan: రొమాంటిక్ కామెడీ లవ్ స్టోరీ ‘రాజా రాణి’తో దర్శకుడిగా పరిచయం అయి… దళపతి విజయ్ తో హ్యాట్రిక్ హిట్లు సాధించి… షారూక్ ఖాన్ ‘జవాన్‌’ తో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. దీనితో అట్లీ నెక్స్ట్ ప్రాజెక్టులో పాన్ ఇండియా రేంజ్ లో ఆశక్తి నెలకొంది. దీనికి తగ్గట్టుగానే త్వరలో భారీ మల్టీ స్టారర్ సినిమాకు సిద్ధమవుతున్నట్లు అట్లీ ప్రకటించారు. విజయ్, అల్లు అర్జున్, రజనీకాంత్, కమల్ హాసన్, షారూక్ ఖాన్ లతో నెక్స్ట్ పాన్ ఇండియా ప్రాజెక్టు ఉండబోతుందంటూ గత కొంత కాలంగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కానీ ఈ సినిమా గురించి అధికారిక సమాచారం ఏదీ రాలేదు.

అయితే తాజాగా అట్లీ ఓ మల్టీస్టారర్‌ మూవీ కథను రెడీ చేశారని, ఇందులో రజనీకాంత్, సల్మాన్‌ ఖాన్‌(Salman Khan) హీరోలుగా నటిస్తారనే టాక్‌ తెరపైకి వచ్చింది. తాజాగా ఈ సినిమాలో రజనీకాంత్‌ ప్లేస్‌ లో కమల్‌హాసన్‌ నటించనున్నారని మరో వార్త ప్రచారంలోకి వచ్చింది. సల్మాన్‌(Salman Khan)–కమల్‌ కాంబినేషన్‌ లో అట్లీ దర్శకత్వంలోని సినిమా దాదాపు ఖరారైనట్లే అనే టాక్‌ బాలీవుడ్‌ లో వినిపిస్తోంది. ఈ సినిమాను దక్షిణాదిలోని అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన సన్‌ పిక్చర్స్‌ నిర్మించనుందని, త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని టాక్‌.

Salman Khan – ఎవరీ అట్లీ

ప్రముఖ దర్శకుడు ఎస్ శంకర్ వద్ద ఎంథిరన్, నన్భన్ చిత్రాలకు సహాయ దర్శకుడి గా చేస్తూ తన సినీ జీవితం ప్రారంభించిన అట్లీ అలియాస్ అట్లీ కుమార్ అలియాస్ అరుణ్ కుమార్… రాజా రాణి సినిమాతో పూర్తి స్థాయి డైరెక్టర్ గా పరిచయం అయ్యారు. ఫాక్స్ స్టార్ స్టూడియోస్ ఏఆర్ మురుగదాస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా విడుదల అయిన నాలుగు వారాల్లోనే 500 మిలియన్లకు పైగా వసూలు చేసి రికార్డు సృష్టించింది. అనతి కాలంలోనే ప్రముఖ హీరో దళపతి విజయ్ తో తేరి , మెర్సల్, బిగిల్ వరుసగా మూడు చిత్రాలు చేసి హ్యాట్రిక్ విజయం సాధించాడు. తరువాత బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తో పాన్ ఇండియా సినిమా జవాన్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ఇండియాలో టాప్ డైరక్టర్స్ సరసన చేరాడు.

Also Read : Ranveer Singh : ‘కల్కి 2898 ఏడీ’ సినిమాపై ప్రశంసలు కురిపించిన రణవీర్ సింగ్

atleeKamal HaasanSalman Khan
Comments (0)
Add Comment