Salman Khan: షూటింగ్‌ లో సల్మాన్‌ కు గాయం ! అయినా షూటింగ్‌కు ‘నో’ చెప్పని నటుడు !

షూటింగ్‌ లో సల్మాన్‌ కు గాయం ! అయినా షూటింగ్‌కు ‘నో’ చెప్పని నటుడు !

Salman Khan: సినిమాల పట్ల బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ యొక్క అంకిత భావం గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సినిమా కోసం అతిథి పాత్ర, కష్టమైన పాత్ర అని తేడా లేకుండా ప్రాణం పెట్టే వ్యక్తిత్వం సల్మాన్ సొంతం. ర్యాష్ డ్రైవింగ్, వన్య ప్రాణుల వేట వంటి వివాదాల్లో చిక్కుకున్నప్పటికీ… సినిమాను వ్యక్తిగత జీవితాన్ని వేరువేరుగా చూస్తాడు ఈ సల్లు భాయ్. అందుకే సల్మాన్ ఖాన్ అంటే పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ఉంటుంది.

Salman Khan…

ప్రస్తుతం సల్మాన్ ఖాన్(Salman Khan)… కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ‘సికందర్‌’ అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో సల్మాన్ సరసన నేషనల్ క్రష్ రష్మిక హీరోయిన్ గా నటిస్తోండగా… సత్యరాజ్, ప్రతీక్‌ బబ్బర్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ ను ప్రారంబించుకున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ఈద్‌ కి విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

అయితే ‘సికందర్‌’ సినిమా షూటింగ్ లో హీరో సల్మాన్ ఖాన్ కు గాయమైనట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్‌ లోనే ఆయన పక్కటెముకకు గాయమైంది. ముంబయిలో నిర్వహించిన ఓ ఈవెంట్‌కు హాజరైన ఆయన కాస్త అసౌకర్యంగా కనిపించారు. సంబంధిత దృశ్యాలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. దీనితో సల్మాన్‌ కు ఏమైదంటూ అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో చిత్ర బృందంలోని ఒకరు జాతీయ మీడియాతో మాట్లాడారు. ప్రమాదమేమీ లేదని తెలిపారు. ప్రస్తుతం ఆయన క్షేమంగానే ఉన్నారు. షెడ్యూల్‌ ప్రకారమే సల్మాన్‌ షూటింగ్‌లో పాల్గొంటున్నారంటూ వివరించారు. గాయమైనా తన కొత్త సినిమా చిత్రీకరణను సల్మాన్‌ ఖాన్‌ కొనసాగిస్తున్నారని తెలిపారు. దీనితో సల్మాన్ ఖాన్ వర్క్ డెడికేషన్ పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Also Read : Om Raut-Adipurush : ‘ఆదిపురుష్’ సినిమాపై వస్తున్న ట్రోల్స్ పై స్పందించిన డైరెక్టర్

AR MurugadossSalman KhanSikandar
Comments (0)
Add Comment