Salman Khan : బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కు ఉన్న క్రేజ్ వేరు. హీరోగా తనకు ఎంత క్రేజ్ ఉన్నప్పటికీ కొన్నిసార్లు స్నేహితులు, అభిమానులు, మీడియా అని తేడా లేకుండా సల్మాన్ ఖాన్ వారితో సరదాగా గడుపుతుంటారు. సల్లూ భాయ్ తో కలిసి ఫోటో దిగితే చాలు అని కోట్లాది మంది అనుకుంటారు. అయితే ఎప్పుడూ అభిమానులతో సరదాగా ఉండే సల్లూ భాయ్… తాజాగా తన స్నేహితురాలైన ఓ మహిళా జర్నలిస్టుకు ఆప్యాయంగా ముద్దు పెట్టారు.
తన మేనల్లుడు అలీజ్ అగ్నిహోత్రి తో కలిసి గోవా వేదికగా జరుగుతోన్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) వేడుకలకు హాజరయిన సల్మాన్ ఖాన్(Salman Khan)… అక్కడ ఎదురైన తన పాత స్నేహితురాలు, మహిళా జర్నలిస్టును ఒక్కసారిగా కౌగిలించుకుని, నుదిటిపై ముద్దు పెట్టాడు. సల్మాన్ చర్యను ఊహించిన ఆ మహిళా జర్నలిస్టు కూడా ‘డ్రామాలు చేయకు’ అంటూ సరదాగా ఆట పట్టించింది. ప్రస్తుతం ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన వారంతా స్నేహితులను సల్మాన్ బాగానే గుర్తు పెట్టుకుంటారంటూ కామెంట్లు పెడుతున్నారు.
Salman Khan – 300 కోట్లు వసూలు చేసిన సల్మాన్ ‘టైగర్3’
యాష్ రాజ్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మాతగా మనీష్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కించిన సినిమా ‘టైగర్3’. సల్మాన్ ఖాన్, ఇమ్రాన్ హష్మీ, కత్రినా కైఫ్, అశుతోష్ రాణా, అనుప్రియా గోయెంకా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను దీపావళి కానుకగా నవంబర్ 10న విడుదల చేసారు. ‘టైగర్ జిందా హై’కు సీక్వెల్‌గా తెరకెక్కించిన ఈ సినిమాలో సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్‌ల యాక్షన్ సన్నివేశాలకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. దీనితో ఈ సినిమా ఇప్పటి వరకు ఈ చిత్రం రూ.300కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
Also Read : Anchor Anasuya : నీతో బంధం ముగిసింది.. అనసూయ పోస్ట్