Salman Khan: సల్మాన్ ఖాన్ పెళ్ళిపై తండ్రి సలీమ్‌ఖాన్‌ ఆశక్తికరమైన వ్యాఖ్యలు !

సల్మాన్ ఖాన్ పెళ్ళిపై తండ్రి సలీమ్‌ఖాన్‌ ఆశక్తికరమైన వ్యాఖ్యలు !

Salman Khan: బాలీవుడ్ లో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్ సల్మాన్‌ ఖాన్‌. 58 ఏళ్ళు వచ్చినా ఇప్పటి వరకు పెళ్లి చేసుకోకపోవడంతో బాలీవుడ్ తో పాటు భారతీయ చలన చిత్ర పరిశ్రమలో సల్మాన్ పెళ్లి ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటుంది. తమ అభిమాన హీరో ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడా, ఓ ఇంటివాడు అవుతాడా అని ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ విషయంపై సల్మాన్‌ తండ్రి సలీమ్‌ఖాన్‌ మాట్లాడిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్ గా మారుతోంది. దీనికి సల్మాన్ ఖాన్ పెళ్లిపై తండ్రి సలీమ్ ఖాన్ చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు కారణమట.

Salman Khan Marriage Updates

‘ఈ రోజుల్లో సల్మాన్‌ కోరుకునే లక్షణాలున్న అమ్మాయి దొరకడం కష్టం. సల్మాన్‌(Salman Khan) ఎవరినైనా త్వరగా ఇష్టపడతాడు. కానీ, అతడికి వివాహం చేసుకొనే ధైర్యం లేదు. సింపుల్‌గా ఉంటాడు కాబట్టి చాలామందికి నచ్చుతాడు. తన జీవితంలోకి వచ్చే స్త్రీ తన తల్లిలా కుటుంబాన్ని చూసుకోగలదా… లేదా అని ఎప్పుడూ ఆలోచిస్తుంటాడు. తన తల్లిలాంటి లక్షణాలున్న అమ్మాయిని వెతుకుతుంటాడు. అతడు పెళ్లి చేసుకున్న అమ్మాయి కూడా తన తల్లిలాగే భర్త, పిల్లలకే అంకితం కావాలని కోరుకుంటాడు. వంట పని, ఇంటి పనులు చేయాలని… కుటుంబసభ్యులకు అన్ని విషయాల్లో సాయం చేయాలని అనుకుంటాడు. ఈరోజుల్లో అలాంటి అమ్మాయిలు ఉండడం సులభం కాదు. అందుకే సల్మాన్‌ఖాన్‌ ఇప్పటివరకు ఎవరినీ వివాహం చేసుకోలేదు’ అని సల్మాన్‌ తండ్రి సలీమ్‌ ఆ వీడియోలో వివరించారు.

గతంలో ఓ సినిమా ప్రమోషన్‌లో సల్మాన్‌(Salman Khan) తన పెళ్లి, లవ్‌స్టోరీల బ్రేకప్‌ ల గురించి మాట్లాడుతూ… ‘నా జీవితంలోకి సరైన వ్యక్తి వచ్చినప్పుడు వివాహం చేసుకుంటాను. నా మాజీ గర్ల్‌ఫ్రెండ్స్‌ అందరూ మంచివారే. వాళ్లవైపు నుంచి ఎలాంటి తప్పు లేదు. నేను వాళ్లను సరిగ్గా చూసుకోలేనేమో అనే భయంతోనే బ్రేకప్‌ చెప్పి ఉండొచ్చు. వాళ్లు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటాను. నా ప్రేమకథలన్నీ నాతోపాటే సమాధి అవుతాయి’ అని తెలిపారు. దీనితో తండ్రీ కొడుకులు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Also Read : Munjya: దుమ్ము రేపుతున్న ‘ముంజా’ సినిమా ! వంద కోట్ల క్లబ్ లో ‘ముంజా’ !

Saleem KhanSalman Khan
Comments (0)
Add Comment