Salman Khan-Bishnoi : గ్యాంగ్ స్టార్స్ బెదిరింపులకు కోట్లు ఖర్చుపెట్టి బులెట్ ప్రూఫ్ కార్ కొన్న సల్మాన్

సల్మాన్ ఖాన్ ప్రభుత్వంపై ఆధారపడకుండా తన భద్రతను తానే చూసుకుంటాడు...

Salman Khan : ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ను చంపేస్తామని లారెన్స్ బిష్ణోయ్, అతని సహచరులు బెదిరిస్తున్నారు. ఇటీవల సల్మాన్ ఖాన్ సన్నిహితుడు బాబా సిద్ధిఖీని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ హత్య చేసింది. దీని తరువాత, సల్మాన్ ఖాన్ మరింత అలర్ట్ అయ్యాడు. ప్రభుత్వం కూడా సూపర్ స్టార్ తో పాటు అతని ఇంటి చుట్టూ భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది. మరోవైపు సల్మాన్ ఖాన్(Salman Khan) కూడా ప్రభుత్వంపై ఆధారపడకుండా తన భద్రతను తానే చూసుకుంటాడు.

Salman Khan…

సల్మాన్ ఖాన్ ప్రభుత్వంపై ఆధారపడకుండా తన భద్రతను తానే చూసుకుంటాడు. ఇప్పటికే ఓ ప్రైవేట్ సెక్యూరిటీ సంస్థ సల్మాన్ ఖాన్ కు భద్రత కల్పిస్తోంది. సల్మాన్ ఖాన్(Salman Khan) వ్యక్తిగత బాడీగార్డ్ షేరా కూడా సల్మాన్‌ వెంటే ఉంటూ.. సెక్యూరిటీని ఇస్తున్నాడు. వీటన్నింటితో పాటు సల్మాన్ ఖాన్ ముంబై పోలీసుల నుండి లైసెన్స్‌తో ఆటోమేటిక్ గన్‌ని కూడా కొనుగోలు చేశాడు. ఇది కాకుండా, సల్మాన్ ఖాన్ ఇటీవల బుల్లెట్ ప్రూఫ్ కారును కొనుగోలు చేశాడు, దాని కోసం అతను భారీ మొత్తంలో ఖర్చు చేశాడు.

ఇటీవల బాబా సిద్ధిఖీ మరణం తర్వాత సల్మాన్ ఖాన్ కొత్త బుల్లెట్ ప్రూఫ్ కారును కొనుగోలు చేసినట్లు ఓ ఫేమస్ బాలీవుడ్ మ్యాగజైన్ పేర్కొంది. ఈ బుల్లెట్ ప్రూఫ్ కారు కోసం సల్మాన్ ఖాన్ 2 కోట్ల రూపాయలు ఖర్చు చేశాడని తెలుస్తోంది. విదేశాల నుంచి ప్రత్యేక ఆర్డర్ పై నిస్సాన్ ఎస్ యూవీని సల్మాన్ కొనుగోలు చేశాడట. ఈ కారుకు సెక్యూరిటీ ఫీచర్స్ కూడా చాలా నే ఉన్నాయట. అంతేకాదు ఏకే 47 గన్ నుంచి వచ్చే బుల్లెట్లను ఆపగలిగే అత్యంత శక్తిమంతమైన అద్దాలను అమర్చడం వల్ల కారు బాడీ మొత్తం కూడా బుల్లెట్ ప్రూఫ్ అని చెబుతున్నారు. బుల్లెట్ ప్రూఫ్ తో పాటు ఈ కారులో బాంబ్ అలర్ట్ టెక్నాలజీ కూడా ఉందట. ల్యాండ్ మైన్లను గుర్తించడంతో పాటు బాంబు దాడులను వీలైనంతవరకు తట్టుకునేలా ఈ కారును రూపొందించారట.

Also Read : Devi Sri Prasad : మ్యూజిక్ డైరెక్టర్ డిఎస్పీ పై భగ్గుమన్న సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్

BreakingSalman KhanUpdatesViral
Comments (0)
Add Comment