Sikandar : తమిళ సినీ దర్శకుడు ఏఆర్ మురుగ దాస్ దర్శకత్వంలో బాలీవుడ్ సూపర్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న కలిసి నటించిన చిత్రం సికిందర్(Sikandar). ఈ మూవీకి సంబంధించి అప్ డేట్ ఇచ్చారు మూవీ మేకర్స్. ఇందులో భాగంగా సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. భారీ ఎత్తున ప్రజాదరణ లభిస్తోంది. అయితే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన సలార్ నుంచి సీన్ ను కాపీ కొట్టారంటూ కొందరు డార్లింగ్ ఫ్యాన్స్ ట్రోల్ చేయడం మొదలు పెట్టారు.
Sikandar Movie Updates
అయినా గతంలో అమీర్ ఖాన్ తో గజినీ తీసిన చరిత్ర ఏఆర్ మురుగదాస్ ది. తనకు కాపీ కొట్టడం, ఇతరులో చెప్పించు కోవడం ఇష్టం ఉండదు. తను చాలా మంది హీరోలకు లైఫ్ ఇచ్చాడు. ప్రధానంగా దళపతి విజయ్ తో తాను తీసిన సర్కార్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇదే సినిమా ఊహించని సక్సెస్ అయ్యింది. కాసుల వర్షం కురిపించింది. ఆ తర్వాత మహేష్ బాబు తో తీసిన మూవీ ఆశించిన మేర రాణించలేదు.
ఇదిలా ఉండగా సోషల్ మీడియా వేదికగా చాలా పుకార్లు షికార్లు చేయడం షరా మామూలేనంటున్నారు దర్శకుడు మురగదాస్. తన కథ నచ్చిన వెంటనే ఓకే చెప్పాడు సల్మాన్ ఖాన్. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంది. రష్మిక , సల్మాన్ జోడి సూపర్ అంటూ కామెంట్స్ కూడా వచ్చేస్తున్నాయి. మొత్తంగా రిలీజ్ చేసిన టీజర్ మాత్రం కెవ్వు కేక అనేలా ఉంది.
Also Read : AP Budget 2025-26 Sensational :ఏపీ బడ్జెట్ లో సంక్షేమానికి ప్రాధాన్యత