Salman Khan: 33,000 అడుగుల ఎత్తులో సల్మాన్ ఖాన్ ఎయిర్ యాక్షన్ సీక్వెన్స్ !

33,000 అడుగుల ఎత్తులో సల్మాన్ ఖాన్ ఎయిర్ యాక్షన్ సీక్వెన్స్ !

Salman Khan: ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో తెరకెక్కిస్తున్న తాజా సినిమా ‘సికందర్‌’. ప్రముఖ నిర్మాత సాజిద్ నడియాడ్‌వాలా తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ ను ఈ నెల 18న ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా రేంజ్ లో విడుదలౌతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ కు సంబంధించి నిర్మాత సాజిద్ నడియాడ్‌వాలా ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఇచ్చారు. ప్రస్తుతం అది నెట్టింట వైరల్ గా మారుతోంది.

Salman Khan Movies

ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సాజిద్ నడియాడ్‌వాలా… సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిస్తున్న ‘సికందర్‌’ సినిమాకు సంబంధించి కీలక అప్ డేట్ ను తన ఇన్ స్టాలో పోస్ట్ చేసారు. ‘‘ఈ నెల 18న ‘సికందర్‌’ యాక్షన్‌ ప్రారంభం కానుంది. మొదటి రోజున అతిపెద్ద ఎయిర్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌తో ఈ షూటింగ్‌ను ఆరంభించనున్నామని తెలుపడానికి చాలా ఉత్సాహంగా ఉందని కామెంట్ పెట్టారు. తొలి షెడ్యూల్‌లో భాగంగా సల్మాన్‌ తో సముద్రమట్టానికి దాదాపు 33,000 అడుగుల ఎత్తులో అద్భుతమైన వైమానిక యాక్షన్‌ సీక్వెన్స్‌ను చిత్రీకరించనున్నట్లు, ఇది ఈ ప్రాజెక్టుకే కీలకమైన సన్నివేశమని తెలుస్తోంది. వచ్చే ఏడాది ఈద్‌కి విడుదల కానుందీ చిత్రం.

Also Read : Vijay Thalapathy: టెన్త్, ఇంటర్ టాపర్స్ కు దళపతి విజయ్‌ స్పెషల్ గిఫ్ట్స్ !

Rashmika MandannaSajid NadiadwalaSalman Khan
Comments (0)
Add Comment