పాన్ ఇండియా హీరోల మధ్య రిలీజ్ వార్ కొనసాగుతోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ మూవీ తో పాటు షారుక్ ఖాన్ నటించిన డుంకీ మధ్య పోటీ నెలకొంది.
సలార్ క్రిస్మస్ కానుకగా ఈ ఏడాది డిసెంబర్ 22న రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే పలుమార్లు డార్లింగ్ మూవీ వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పటికే చిత్రానికి సంబంధించి పోస్టర్స్ ఆకట్టుకుంటున్నాయి.
ఆది పురుష్ మూవీ ఆశించినంత మేర ఆడలేదు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ పై భారీగా నమ్మకం పెట్టుకున్నాడు. గతంలో యశ్ తో నీల్ తీసిన కేజీఎఫ్ దుమ్ము రేపింది. ఇక షారుక్ ఖాన్ విషయానికి వస్తే ఈ ఏడాది పంట పండింది. తను నటించిన రెండు సినిమాలు రూ. 1,000 కోట్లు వసూళ్లు చేయడం విశేషం.
దీపికా పదుకొనేతో కలిసి నటించిన పఠాన్ చిత్రం వెయ్యి కోట్లు వసూలు చేసింది. రికార్డ్ బ్రేక్ చేసింది. ఇక తమిళ యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ అట్లీ కుమార్ దర్శకత్వం వహించిన జవాన్ చిత్రం రికార్డుల మోత మోగించింది. షారుక్ ఖాన్ కెరీర్ లో మరిచి పోలేని విజయాన్ని చేకూర్చి పెట్టాడు .
దీంతో తాను మరిచి పోలేని సక్సెస్ ఇచ్చినందుకు అట్లీ కుమార్ కు ధన్యవాదాలు తెలిపారు. ఇదిలా ఉండగా సలార్ విడుదల రోజునే షారుక్ ఖాన్ నటించిన డుంకీ కూడా విడుదల కానుండడంతో మార్కెట్ లో ఏం జరగబోతోందనేది ఉత్కంఠగా మారింది.