Salaar Trailer : స‌లార్ ట్రైల‌ర్ అప్ డేట్

త్వ‌ర‌లోనే తేది ప్ర‌క‌టించే ఛాన్స్

Salaar Trailer : అంద‌రి క‌ళ్లు ఇప్పుడు డార్లింగ్ ప్ర‌భాస్ పై ఉన్నాయి. కార‌ణం య‌శ్ తో సెన్సేష‌న్ మూవీ కెజిఫ్ తీసిన ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌స్తుతం స‌లార్ రాబోతోంది. ఈ సినిమాకు సంబంధించి రోజుకో అప్ప డేట్ వ‌స్తోంది. ఇప్ప‌టికే అమెరికాలో ముంద‌స్తు బుకింగ్స్ కూడా అయి పోయాయి. ఏ సినిమాకు లేనంత డిమాండ్ స‌లార్ చిత్రంపై నెల‌కొంది.

Salaar Trailer Trending Views

మేకింగ్, టేకింగ్ లో త‌నకంటూ స్పెష‌ల్ ఇమేజ్ క‌లిగిన ద‌ర్శ‌కుడిగా గుర్తింపు పొందాడు ప్ర‌శాంత్ నీల్. ప్ర‌భాస్ తో పాటు శ్రుతీ హాస‌న్ న‌టిస్తోంది. చిత్రంపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇంకా దేనిని ఆధారంగా తీసుకుని క‌థ‌ను తెర‌కెక్కిస్తున్నాడ‌నేది ఇంకా రివీల్ చేయ‌లేదు ప్ర‌శాంత్ నీల్.

గ‌తంలో లేనంత‌టి బ‌డ్జెట్ తో స‌లార్ ను తీశాడ‌ని సినీ వ‌ర్గాల‌లో టాక్. ఇక డార్లింగ్ ప్ర‌భాస్ , కృతీ స‌న‌న్ తో క‌లిసి న‌టించిన ఓం రౌత్ తీసిన ఆది పురుష్ ఆశించిన మేర ఆడ‌లేదు. ఇప్పుడు ప్ర‌భాస్ ఫ్యాన్స్ ప్ర‌శాంత్ నీల్ పై న‌మ్మ‌కం పెట్టుకున్నారు.

ఎలాగైనా స‌రే రాబోయే స‌లార్ ప‌క్కా స‌క్సెస్ అవుతుంద‌నే న‌మ్మ‌కంతో ఉన్నారు. ఇక స‌లార్(Salar Trailer) సినిమాకు సంబంధించి ట్రైల‌ర్ ఎప్పుడు వ‌స్తుంద‌నే దానిపై ద‌ర్శ‌కుడు క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు.

ఈ మూవీ ట్రైల‌ర్ ఎప్పుడు అనే దాని గురించి ఆదివారం తెలియ చేస్తున్న‌ట్లు సినీ వ‌ర్గాల‌లో ప్ర‌చారం జ‌రుగుతోంది.

Also Read : Jawan Trailer : షారుక్ జ‌వాన్ ట్రైల‌ర్ అదుర్స్

Comments (0)
Add Comment