Salaar: ఓటీటీ వచ్చిన తరువాత సినిమాలకు భాష, దేశం, ప్రాంతం అనే హద్దులు చెరిగిపోయాయి. ఓటీటీలో విశేషమైన విదేశీ అభిమానులను సంపాదించుకుంటున్న స్టార్ హీరోలు… ఆయా సినిమాలను అయా దేశాల్లో విడుదల చేస్తున్నారు. ఇటీవల రాజమౌళి సినిమాలు జపాన్ లో వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భాలు కూడా చూసాము. ఈ కోవలో మరో రెండు ఇండియన్ సినిమాలు జపాన్‌లో సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ‘సలార్’ జులై 5న జపాన్‌లో విడుదల కానుంది. అలాగే షారుక్ ఖాన్ ‘జవాన్’ కూడా అక్కడ రిలీజ్ డేట్‌ను ఖరారు చేసుకుంది.
Salaar Release..
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ‘సలార్’ బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. రూ.270 కోట్లతో నిర్మించిన ఈ సినిమా సుమారు రూ.715 కోట్లు వసూళ్లు చేసింది. ఇప్పుడీ చిత్రం జులై 5న జపాన్‌లో విడుదల కానుంది. గతంలో ప్రభాస్ నటించిన కొన్ని సినిమాలు అక్కడ మంచి కలెక్షన్స్ సొంతం చేసుకున్నాయి. ఇప్పడు ‘సలార్’ కోసం అక్కడి ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇటీవల విడుదలైన జపాన్ రిలీజ్ ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ విషయంపై ప్రభాస్ స్పెషల్ వీడియో పోస్ట్ చేశారు. ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను చూసి ఎంజాయ్ చేయండి అని పేర్కొన్నారు.
Also Read : Anjali: మరోసారి వేశ్య పాత్రలో అంజలి !