Salaar Prabhas : దమ్మున్న డైరెక్టర్ గా పేరు పొందాడు కర్ణాటక సినీ రంగానికి చెందిన ప్రశాంత్ నీల్. యశ్ తో ఆయన తీసిన కేజీఎఫ్ భారతీయ సినిమాను షేక్ చేసేలా చేసింది. కోట్లు కొల్లగొట్టింది. ఏక కాలంలో విడుదలై అందరి అంచనాలు తలకిందులు చేస్తూ రూ. 600 కోట్లకు పైగా వసూలు చేసింది.
Salaar Prabhas Updates
ఆ తర్వాత కేజీఎఫ్ కు సీక్వెల్ గా కేజీఎఫ్-2 తీశాడు దర్శకుడు . అది కూడా బిగ్ సక్సెస్ . ఇందులో కూడా యశ్ నటించాడు. ఆయనకు ప్రతి నాయకుడిగా ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్ర పోషించాడు.
ఆ తర్వాత డార్లింగ్ ప్రభాస్ తో సలార్(Salaar Prabhas) సినిమా తీశాడు ప్రశాంత్ నీల్. సెప్టెంబర్ నెలలో విడుదల చేయాలని అనుకున్నారు. కానీ అనుకోకుండా చిత్రాన్ని వాయిదా వేశారు మూవీ మేకర్స్. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు లోనయ్యారు.
కథా పరంగా చూస్తే సలార్ లో ఒక ముఠా నాయకుడు తన ఫ్రెండ్ కోసం చేసిన వాగ్ధానాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నం చేశాడు. ఇదే కీలకమైన కథ సలార్ లో. సలార్ లో ప్రభాస్ తో పాటు శృతీ హాసన్ , పృథ్వీ రాజజ్ , సుకుమారన్ నటించారు.
Also Read : Lokesh Kanagaraj : సూర్యతో లోకేష్ మూవీ ఫిక్స్