Salaar Part 2: ‘కేజీయఫ్’ సిరీస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్, శృతిహాసన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన సినిమా ‘సలార్’. 2023 డిసెంబరు 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ను సొంతం చేసుకోవడమే కాకుండా… కలెక్షన్ల విషయంలో వెయ్యి కోట్ల క్లబ్ వైపు దూసుకుపోతుంది. దీనితో ‘సలార్ పార్ట్ 2’ కోసం ప్రభాస్ అభిమానులతో పాటు సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘సలార్ పార్ట్ 2’ విడుదలపై నిర్మాత విజయ్ కిరగందూర్ స్పందించారు. ఇటీవల జాతీయ మీడియాతో మాట్లాడుతూ… 2025 లో ‘సలార్ పార్ట్ 2’ ను రిలీజ్ చేయనున్నట్లు చెప్పారు. దీనితో నిర్మాత విజయ్ కిరగందూర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
Salaar Part 2 – సలార్ నిర్మాత ఏమన్నారంటే ?
‘‘సలార్ పార్ట్ 2 స్క్రిప్టు సిద్ధమైంది. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడైనా ప్రారంభించే అవకాశాలున్నాయి. ప్రభాస్, ప్రశాంత్ నీల్ వీలైనంత త్వరగా షూటింగ్ మొదలుపెట్టాలనుకుంటున్నారు. 15 నెలల్లో సలార్ పార్ట్ 2ని పూర్తిచేయాలని మేమంతా నిర్ణయించుకున్నాం. కాబట్టి 2025లో సలార్ పార్ట్ 2 విడుదల చేస్తాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అభిమానులందరినీ ‘సలార్’ ఆకట్టుకుంది. ‘‘సలార్ పార్ట్ 1’(Salaar Part-1)… సలార్ పార్ట్ 2కు ఒక ట్రైలర్ లాంటిది. సలార్ పార్ట్ 2… ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’లా ఉండనుంది. యాక్షన్, డ్రామా, పాలిటిక్స్… ఇలా పలు అంశాలు ఈ సీక్వెల్‌లో కనిపిస్తాయి. దర్శకుడు పార్ట్ 1లో పాత్రలన్నింటినీ పరిచయం చేశారు. సీక్వెల్ లో చాలా సర్‌ప్రైజ్‌లు ఉంటాయి’’ అని నిర్మాత విజయ్ చెప్పారు.
Also Read : Hero Suriya: సుధ కొంగరతో మరోసారి జతకట్టనున్న సూర్య !