Salaar Movie : భారీ ధ‌ర‌కు స‌లార్ మూవీ

రూ. 350 కోట్ల నాన్ థియేట్రిక‌ల్ రైట్స్

Salaar Movie : ప్ర‌ముఖ సినీ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన స‌లార్ మూవీపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇప్ప‌టికే రెండు సార్లు సినిమా రిలీజ్ వాయిదా వేస్తూ వ‌చ్చారు మూవీ మేక‌ర్స్. అయినా ఎక్క‌డా పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ న‌టించిన చిత్రానికి డిమాండ్ త‌గ్గ‌డం లేదు.

Salaar Movie Updates

ఊహించ‌ని రీతిలో బ‌హిరంగ సినీ మార్కెట్ లో స‌లార్(Salaar Movie) కు భారీ క్రేజ్ ద‌క్కుతోంది. యాక్ష‌న్ ప్ర‌ధానంగా తెర‌కెక్కించాడు ద‌ర్శ‌కుడు. ఇప్ప‌టికే య‌శ్ తో ఆయ‌న తీసిన కేజీఎఫ్ భారీతీయ సినిమా రంగంలో ఓ సెన్సేష‌న్. దానికి సీక్వెల్ కూడా తీశాడు ప్ర‌శాంత్ నీల్. అది కూడా కోట్లు కొల్ల‌గొట్టింది.

ఆ త‌ర్వాత వ‌స్తున్న మూవీ సలార్. దీంతో ప్ర‌భాస్ ఫ్యాన్స్ దీనిపై అంచ‌నాలు పెట్టుకున్నారు. త‌ప్ప‌కుండా ప్ర‌భాస్ న‌ట‌న‌కు త‌ప్ప‌కుండా మార్కులు ప‌డ‌తాయ‌ని అంటున్నారు. ఇదిలా ఉండ‌గా ట్రేడ్ వ‌ర్గాల అంచ‌నా మేర‌కు నాన్ థియేట్రిక‌ల్ రైట్స్ ను ఏకంగా రూ. 350 కోట్ల‌కు అమ్మిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

శాటిలైట్ , డిజిట‌ల్ , మ్యూజిక్ , నాన్ థియేట్రిక‌ల్ రైట్స్ ను ఇప్ప‌టికే మూవీ మేక‌ర్స్ అమ్మేసిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. స్టార్ నెట్ వ‌ర్క్ శాటిలైట్ హ‌క్కుల‌ను పొందింది. స‌లార్ చిత్రంలో ప్ర‌భాస్ తో పాటు శ్రుతీ హాస‌న్ , పృథ్వీ రాజ్ , సుకుమార్ , జ‌గ‌తిబాబు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. హోంబ‌లే ఫిల్మ్స్ దీనిని నిర్మించారు.

Also Read : Payal Rajput Vs Sreeleela

Comments (0)
Add Comment