Salaar Movie : స‌లార్ మూవీ అప్ డేట్

ప్ర‌భాస్ బ‌ర్త్ డే రోజు ట్రైల‌ర్

కేజీఎఫ్ త‌ర్వాత ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న స‌లార్ చిత్రంపై పెద్ద ఎత్తున అంచ‌నాలు ఉన్నాయి. ఫ్యాన్స్ తెగ ఫీల్ అవుతున్నారు. ఇప్ప‌టికే అప్పుడు ఇప్పుడు అంటూ సినిమాకు సంబంధించి రిలీజ్ తేదీని వాయిదా వేయ‌డంపై మండి ప‌డుతున్నారు.

స‌లార్ కోసం వేయి క‌ళ్ల‌తో ఎదురు చూస్తున్నారు . ఇప్ప‌టికే రిలీజ్ చేసిన పోస్ట‌ర్స్ కిర్రాక్ తెప్పించేలా ఉన్నాయి. ఇందులో పాన్ ఇండియా హీరో డార్లింగ్ ప్ర‌భాస్ తో పాటు శృతీ హాస‌న్ , సంజ‌య్ ద‌త్ న‌టిస్తున్నారు.

స‌లార్ ను కాంతార ఫేమ్ హోంబ‌లే ఫిలిమ్స్ నిర్మిస్తోంది. సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు వేగంగా జ‌రుపుకుంటోంది. అన్నీ ద‌గ్గ‌రుండీ చూసుకుంటున్నారు ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్. సెప్టెంబ‌ర్ 28న రిలీజ్ చేస్తామ‌న్నారు. కానీ అది కూడా వాయిదా ప‌డేలా ఉంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఈ త‌రుణంలో సెప్టెంబ‌ర్ 23న డార్లింగ్ ప్ర‌భాస్ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా స‌లార్ మూవీకి సంబంధించి టీజ‌ర్ విడుద‌ల చేయ‌నున్న‌ట్లు సినీ వ‌ర్గాల‌లో టాక్. కాగా ప్ర‌భాస్ న‌టించిన ఆది పురుష్ చిత్రం ఆశించిన మేర ఆడ‌లేదు. ప్ర‌స్తుతం తాజాగా న‌టిస్తున్న స‌లార్ పై ఎక్కువ‌గా న‌మ్మ‌కం పెట్టుకున్నాడు.

Comments (0)
Add Comment