Salaar Movie : ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న డార్లింగ్ ప్రభాస్ నటిస్తున్న సలార్ మూవీ రిలీజ్ కాకుండానే రికార్డులు క్రియేట్ చేస్తోంది. అంచనాలకు మించి ఈ సినిమాపై భారీ ప్రచారం చోటు చేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ సందర్భంగా సలార్ ను రిలీజ్ చేస్తామని మూవీ మేకర్స్ ప్రకటించారు.
Salaar Movie Viral
ఇప్పటికే అంతటా సలార్(Salaar) ఫీవర్ కొనసాగుతోంది. ఆకట్టుకునే సన్నివేశాలు, గగుర్పొడిచే దృశ్యాలు, దుమ్ము రేపే డైలాగులు సినిమాలో లెక్కకు మించి ఉన్నాయని దర్శకుడు ఇప్పటికే ప్రకటించాడు.
అందుకు తగ్గట్టుగానే సలార్ రిలీజ్ కాకుండా రికార్డ్ బ్రేక్ చేసింది. ప్రభాస్ నటించిన ఆది పురుష్ చిత్రం ఆశించినంత మేర ఆడక పోయినా తన క్రేజ్ మాత్రం తగ్గలేదు. ముఖ్యంగా హీరోలను వాడుకోవడంలో వారిలోని సామర్థ్యాన్ని తెర మీద ప్రదర్శించడంలో తనకు తనే సాటి ప్రశాంత్ నీల్. తను తీసే ప్రతి ఫ్రేమ్ ఎదుటి వారిని మళ్లీ మళ్లీ చూసేలా చేస్తుంది.
సినిమాకు సంబంధించి అప్ డేట్ ఇచ్చారు మూవీ మేకర్స్. డిసెంబర్ 1న సలార్ ట్రైలర్ విడుదల చేస్తామని, రాత్రి 7.30 గంటలకు ముహూర్తం నిర్ణయించామని తెలిపారు. ఇదిలా ఉండగా పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. దీనికి మంచి ఆదరణ లభిస్తోంది. రిలీజ్ అయ్యాక ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తోంది సలార్ వేచి చూడాలి.
Also Read : Animal Emotional Song : యానిమల్ ఎమోషనల్ సాంగ్