Salaar Movie : సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రెబల్ స్టార్ డార్లింగ్ ప్రభాస్ , శృతీ హాసన్ కలిసి నటిస్తున్న సలార్ మూవీపై భారీ ఎత్తున అంచనాలు నెలకొన్నాయి. ఈనెలలోనే విడుదల కావాల్సి ఉండగా అట్లీ కుమార్ దర్శకత్వం వహించిన జవాన్ సెప్టెంబర్ 7న విడుదలైంది. భారీ రెస్పాన్స్ వచ్చింది. తొలిరోజే రూ. 120 కోట్లు కొల్లగొట్టింది.
Salaar Movie Updates
దీంతో సలార్ , జవాన్ మధ్య గ్యాప్ ఉండాలనే ఉద్దేశంతో మూవీ మేకర్స్ సలార్ చిత్రాన్ని(Salaar Movie) వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. పాన్ ఇండియా హీరోగా ఇప్పటికే పేరు పొందిన ప్రభాస్ తన ఆశలన్నీ ప్రశాంత్ నీల్ పై పెట్టుకున్నాడు.
కన్నడ సూపర్ స్టార్ యశ్ తో ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ , కేజీఎఫ్ -2 తీశాడు. భారతీయ సినిమా రంగంలో ఓ సెన్సేషన్ క్రియేట్ చేశాడు ఈ చిత్రంతో. నీల్ దర్శకత్వం లో రాబోతున్న ప్రభాస్ సలార్ పై పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. కేజీఎఫ్ కంటే మించి ఉంటుందని భావిస్తున్నారు.
ఇప్పటికే చిత్రానికి సంబంధించి రిలీజ్ చేసిన పోస్టర్స్ నెట్టింట్లో ట్రెండింగ్ లో ఉన్నాయి. తాజాగా అందిన సమాచారం మేరకు డార్లింగ్ ప్రభాస్ సలార్ లో ద్విపాత్రాభినయం (డబుల్ రోల్ ) చేస్తున్నట్లు టాక్. మరి ఏ మేరకు సినిమా ఉంటుందో వేచి చూడాలి.
Also Read : Chandramukhi 2 : చంద్రముఖి-2 రిలీజ్ వాయిదా