Salaar Movie: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా… ‘కేజీఎఫ్’ సిరీస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా ‘సలార్’. డిసెంబర్ 22న విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను ఇటీవలే విడుదల చేసారు. ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో అటు ప్రభాస్… ఇటు ప్రశాంత్ నీల్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఈ సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘సలార్’ సినిమా సెన్సార్ పనులు పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనితో ‘సలార్’ సెన్సార్ సర్టిఫికెట్ కు సంబంధించిన పలు అంశాలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారుతున్నాయి.
Salaar Movie – ‘సలార్’ కు ‘A’ సర్టిఫికెట్ !
ప్రభాస్ అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ‘సలార్’ సినిమా సెన్సార్ పనులు పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. సెన్సార్ రిపోర్ట్ ప్రకారం ‘సలార్(Salaar)’ మూవీ నిడివి (రన్ టైం).. 2 గంటల 55 నిమిషాల 22 సెకన్లు అని తెలుస్తోంది. అలాగా సెన్సార్ బోర్డు ఈ సినిమాకు ‘A’ సర్టిఫికెట్ ఇచ్చినట్లు సమాచారం అందుతోంది. అంటే యాక్షన్ సీట్లు ఎక్కువగా ఉండటంతోనే ఈ సినిమాకు ‘A’ సర్టిఫికెట్ ఇచ్చినప్పటికీ… నిబంధనల ప్రకారం 18 ఏళ్ల నిండని వాళ్లని ఈ సినిమాకు అనుమతించ కూడదు.
అదే సమయంలో ఈ సినిమాలోని ప్రభాస్ ఎంట్రీ కూడా అరగంట తర్వాతే ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. తొలుత అరగంట పాటు కన్సర్ ప్రపంచాన్ని.. జగపతిబాబు-పృథ్వీరాజ్ పాత్రల్ని ఎష్టాబ్లిష్ చేస్తారని సమాచారం. దీనితో అటు సెన్సార్… ఇటు ప్రభాస్ లేట్ ఎంట్రీపై సోషల్ మీడియాలో పలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే ఈ సినిమా యూనిట్ నుండి మాత్రం ఎటువంటి అధికారిక సమాచారం ఇంతవరకు బయటకు రాలేదు.
Also Read : Heroine Nayanatara: లేడీ సూపర్ స్టార్ పిలుపుపై నయనతార అభ్యంతరం