Salaar Bike:పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కేజీఎస్ సిరీస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వచ్చిన తాజా బ్లాక్ బస్టర్ సినిమా సలార్. గత ఏడాది డిసెంబరులో విడుదలై… సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా కొద్దిరోజుల క్రితమే స్టార్ మా ద్వారా బుల్లితెరపై కూడా సందడి చేసింది. ఈ క్రమంలో సినిమా చూస్తూ సలార్ బైక్ ను సొంతం చేసుకునే అవకాశాన్ని ప్రేక్షకులకు స్టార్ మా యాజమాన్యం కల్పించారు. తాజాగా విన్నర్‌కు సంబంధించిన వివరాలతో పాటు ఒక వీడియోను స్టార్ మా షేర్ చేసింది.
సినిమా థియేటర్లు, ఓటీటీలో సందడి చేసిన సలార్ మూవీ ఏప్రిల్ 21న ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు స్టార్ మాలో టెలికాస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాను చూస్తూ బైక్ ను గెలుచుకోవచ్చని హోంబలే ఫిలిమ్స్ ప్రకటించింది. ఏ విధంగా సలార్ బైక్ ను సొంతం చేసుకోవాలో కూడా హోంబలె ఫిలిమ్స్ తమ ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. ఏప్రిల్ 21న సలార్ సినిమాను చూస్తున్న సమయంలో స్క్రీన్ పై ఒకవైపు బైకు కనిపిస్తూ ఉంటుంది. ఆ సమయంలో బైక్ ఎన్ని సార్లు స్క్రీన్ మీద కనిపించిందో ప్రేక్షకులు లెక్కబెట్టాలని ఆ వెంటనే 9222211199 నంబర్ కు SALAAR అని టైప్ చేసి పంపించాలని మేకర్స్ కోరారు. ఈ ఎస్సెమ్మెస్‌లను డిప్ ద్వారా ఎంపిక చేస్తామని ఆ సమయంలో ప్రకటించింది.
Salaar Bike:
దీనితో చాలా మంది ప్రేక్షకులు, ప్రభాస్ అభిమానులు వారు చెప్పినట్లుగానే మెసేజ్ లు పంపించారు. ఆ వివరాలను వీడియో ద్వారా మేకర్స్ తాజా ప్రకటించారు. విజయవాడకు చెందిన వరప్రసాద్ అనే వ్యక్తి సలార్ బైక్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ సందర్భంగా సలార్(Salaar) బైక్ ను విజేత వరప్రసాద్‌కు అందచేశారు. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 700 కోట్లకుపైగానే కలెక్ట్ చేసిన ‘సలార్’ రెండో భాగం ‘శౌర్యంగపర్వం’ పనులను ప్రారంభించారు దర్శకుడు ప్రశాంత్ నీల్. ప్రీ ప్రోడక్షన్ వర్క్ పూర్తి కావస్తుండటంతో కొద్దిరోజుల్లో షూటింగ్ ని త్వరలో ప్రారంభించబోతున్నట్లు సమాచారం.
Also Read:Nagarjuna: ‘కుబేర’ సినిమా నుండి నాగార్జున ఫస్ట్ లుక్ రిలీజ్ !