Salaar: ‘సలార్‌’ ఫస్ట్ డే కలెక్షన్స్‌ ఎంతంటే!

‘సలార్‌’ ఫస్ట్ డే కలెక్షన్స్‌ ఎంతంటే!

Salaar: ‘కేజీయఫ్‌’ సిరీస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్, శృతిహాసన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన సినిమా ‘సలార్‌’. ప్రపంచ వ్యాప్తంగా శుక్రవారం విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ప్రశాంత్ నీల్‌ దర్శకత్వానికి… ప్రభాస్‌, పృథ్వీరాజ్‌ల యాక్టింగ్‌కు యాక్షన్‌ ప్రియులు ఫిదా అవుతున్నారు. దీనితో ‘సలార్‌’ సినిమాకు బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఫలితంగా తొలిరోజే ఈ సినిమా భారీ కలెక్షన్లు రాబట్టింది. అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే అదరగొట్టిన ‘సలార్‌(Salaar)’ ప్రపంచవ్యాప్తంగా మొదటిరోజు రూ.175కోట్ల (గ్రాస్‌) వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఇండియాలో ఫస్ట్ డే రూ.95 కోట్లు సాధించిందని ట్రేడ్‌ వర్గాల సమాచారం. సినిమా టాక్ ను బట్టి వీకెండ్ అయ్యేసరికి ఈ వసూళ్లు వీకెండ్‌కు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీనితో ఒకే సంవత్సరంలో రెండు సినిమాలకు మొదటిరోజే రూ.100కోట్ల కలెక్షన్లు సాధించిన హీరోగా ప్రభాస్‌ రికార్డు సృష్టించాడు.

Salaar Movie Updates

‘కేజీయఫ్‌’ లాంటి భారీ ప్రాజెక్ట్‌ తర్వాత ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహించిన ‘సలార్‌’ సినిమాపై విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిన ప్రభాస్ కు… సాహో, రాధేశ్యామ్, ఆది పురుష్ వంటి సినిమాలు కాస్తా నిరాశ పరచినా క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. మరోవైపు మలయాళ అగ్ర నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు, శృతి హాసన్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయ. దీనికి తోడు ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి చిత్ర యూనిట్ పంచుకున్న విశేషాలతో అవి కాస్తా రెట్టింపయ్యాయి. అయితే వాటన్నింటినీ అందుకుని ఈ చిత్రం సూపర్‌హిట్‌గా నిలిచింది. దేవాగా ప్రభాస్‌, వ‌ర‌ద రాజమ‌న్నార్‌గా పృథ్వీరాజ్ సుకుమార‌న్‌ నటన, యాక్షన్‌ సన్నివేశాలు ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఎన్నో రోజులుగా హిట్ కోసం ఎదురుచూస్తున్న ప్రభాస్ అభిమానులకు ఈ సినిమా ఒక ఫుల్ మీల్స్ గానే చెప్పవచ్చు. దీనితో ‘సలార్‌’ కచ్చితంగా రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరుతుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు..

Also Read : Director KR: ఒక టికెట్టు కొంటే మరొకటి ఉచితం… ఈ సినిమా తోనే…

PrabhasSalaar
Comments (0)
Add Comment