Sakshi Vaidya: మలయాళ సీమలోకి అఖిల్ బ్యూటీ !

మలయాళ సీమలోకి అఖిల్ బ్యూటీ !

మలయాళ సీమలోకి అఖిల్ బ్యూటీ !

‘ఏజెంట్‌’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన కొత్త అందం సాక్షి వైద్య. ఆ సినిమా ఆమెకు చేదు ఫలితాన్ని అందించినా… వెంటనే ‘గాండీవధారి అర్జున’లో అవకాశం దక్కించుకుంది. కానీ అదీ ఆమెకు ఆశించిన ఫలితాన్ని అందివ్వలేదు. దీనితో కాస్తా గ్యాప్ తీసుకున్న సాక్షి వైద్య… మలయాళ సినిమా పరిశ్రమలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయింది.

ప్రస్తుతం ఆమె ‘హాల్‌’ అనే మలయాళం సినిమాలో నటిస్తోంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ టైటిల్‌ పోస్టర్‌ ను పోస్ట్ చేసింది. షేన్‌ నిగమ్‌ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను ప్రశాంత్‌ విజయ్‌ కుమార్‌ తెరకెక్కిస్తున్నారు. జేవీజే ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఇదొక భిన్నమైన మ్యూజికల్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెల నుంచి చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి నందగోపాలన్‌ సంగీతమందిస్తున్నారు. ఇక సాక్షి ప్రస్తుతం తెలుగులో శర్వానంద్‌కు జోడీగా రామ్‌ అబ్బరాజు తెరకెక్కిస్తున్న చిత్రంలో నటిస్తోంది. ఇది ఇటీవలే చిత్రీకరణ ప్రారంభించుకుంది.

Akkineni AkhilSakshi Vaidya
Comments (0)
Add Comment