Saindhav Review : విక్టరీ వెంకటేష్ కెరీర్‌లో 75వ సినిమా ‘సైంధవ్’. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్, ఆర్య, ఆండ్రియా మరియు నవాజుద్దీన్ సిద్ధిఖీ కూడా నటించారు. చంద్రప్రస్థ ఫిక్షనల్ పోర్ట్ ఏరియా బ్యాక్‌డ్రాప్‌లో వెంకటేష్ కెరీర్‌లో భారీ బడ్జెట్ చిత్రంగా చిత్రీకరించబడింది. టీజర్, ట్రైలర్‌తో అంచనాలు పెంచేసిన ‘సైంధవ్’ చిత్రం సంక్రాంతి కానుకగా ఈరోజు (జనవరి 13) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా విడుదలయింది. ఇప్పటికే ఓవర్సీస్‌లో ‘సైంధవ్(Saindhav)’ స్క్రీనింగ్ ముగిసింది, చూసినవాళ్లు ఏమంటున్నారు? వెంకీ మామ హిట్ కొట్టాడా? ట్విట్టర్ రివ్యూస్ ఏంటో? చూద్దాం.
Saindhav Review Viral
దీంతో వెంకీ మామ ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. సైంధవ్(Saindhav) సినిమా బాగుందని మెచ్చుకున్నారు. “పెద్దోడి విశ్వరూపం” అనే కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి. సినిమాను ఎంజాయ్ చేయవచ్చని కామెంట్స్ పెడుతున్నారు. ‘సైంధవ్’ సినిమా చాలా అందంగా ఉంటుందన్నారు. నవాజుద్దీన్ సిద్ధిఖీ నటన, కొన్ని సన్నివేశాలు, వెంకీ మామ క్లైమాక్స్ అద్భుతంగా ఉందంటూ రివ్యూలు ఇస్తున్నారు. అయితే తనపై చాలా అంచనాలు ఉన్నాయని, కానీ వాటిని అందుకోలేకపోయారని ఓ నెటిజన్ కామెంట్ చేసాడు. కానీ సినిమా మాత్రం ఎక్కడా బోర్ కొట్టదన్నారు.
‘సైంధవ్’ సినిమాని ఒక్కసారి చూస్తే చాలని, వెంకీ మామ బయపెట్టాడని అంటున్నారు కొందరు. అతను సినిమా ఓ మై గాడ్ అనేలా చేసాడని అభినందిస్తున్నారు. RR మరియు BGM పుష్కలంగా ఉందని, నవాజుద్దీన్ సిద్ధిఖీ నటనకు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఫస్ట్ హాఫ్ డీసెంట్ గా ఉందని అంటున్నారు. కథ మొదట్లో నిదానంగా మొదలై, 30 నిమిషాల తర్వాత వేగం పుంజుకుంటుంది. యాక్షన్ సీక్వెన్స్ చాలా బాగున్నాయని వ్యాఖ్యానిస్తున్నారు. నటీనటులు తమ నటనతో ఆకట్టుకున్నారు. ఎమోషనల్, యాక్షన్ సన్నివేశాలు బాగున్నాయని ఓ నెటిజన్ పోస్ట్ చేశాడు. ఓవరాల్ స్టోరీ ఎమోషనల్ గా బాగుందని కామెంట్ చేశాడు. ఇంటెన్స్ సీన్స్ చాలా బాగున్నాయని రాసాడు.
సెకండ్ హాఫ్ బాగానే ఉందని, కానీ ఎమోషనల్ కనెక్షన్ లోపించిందని కొందరు అంటున్నారు. కానీ మొత్తానికి హిట్ బొమ్మగా చెప్పుకొచ్చారు. ఓవరాల్‌గా సైంధవ్ చిత్రానికి ట్విట్టర్‌లో పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో అభిమానులు వెంకీ మామని ప్రశంసిస్తున్నారు. మరి కాసేపట్లో ఫైనల్ రివ్యూ రానుంది.
Also Read : Manam Saitham : ఆపదలో ఉన్నవారిని ఆడుకుంటున్న కాదంబరి కిరణ్