Saindhav : నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై శైలేష్ కొలను దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కించిన సినిమా ‘సైంధవ్’. శ్రద్ధా శ్రీనాథ్, బేబీ సారా, నవాజుద్దీన్ సిద్ధిఖీ, రుహానీ శర్మ, ఆండ్రియా తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ పాన్ ఇండియా సినిమా… జనవరి 13న సంక్రాంతి కానుకగా విడుదలై పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన ‘సైంధవ్’… యాక్షన్ ప్రియులకు మంచి వినోదాన్ని పంచింది. ఈ సినిమా తెలుగులో అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ మూవీ హిందీ వెర్షన్ ను కూడా అందుబాటులోకి తెస్తోంది చిత్ర యూనిట్. ప్రముఖ ఓటీటీ వేదికలు కలర్స్ సినీ ప్లెక్స్, జియో సినిమాలో జూన్ 23న రాత్రి 8 గంటలకు వరల్డ్ ప్రీమియర్ గా స్ట్రీమింగ్ చేయనున్నారు.
Saindhav – ‘సైంధవ్’ కథేమిటంటే ?
చంద్రప్రస్థ అనే కల్పిత నగరం నేపథ్యంలో సాగే కథ ఇది. సైంధవ్(Saindhav) కోనేరు అలియాస్ సైకో (వెంకటేశ్) తన ప్రాణానికి ప్రాణమైన కూతురు గాయత్రి (బేబి సారా)తో కలిసి నివసిస్తుంటాడు. భర్త నుంచి విడిపోయిన మనో (శ్రద్ధా శ్రీనాథ్)తో అనుబంధం ఏర్పడుతుంది. గతంలో కార్టెల్ సంస్థలో పనిచేసిన సైకో.. పెళ్లి తర్వాత భార్యకి ఇచ్చిన మాట కోసం అక్కడ పని చేయడం మానేసి కూతురే ప్రపంచంగా బతుకుతుంటాడు. ఇంతలో ‘స్పైనల్ మస్కులర్ అట్రోఫీ’ అనే జబ్బుతో కూతురు ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుంది. ఆ జబ్బు నుంచి బయట పడాలంటే రూ.17 కోట్ల విలువ చేసే ఇంజెక్షన్ అవసరమని సూచిస్తారు డాక్టర్లు. అంత డబ్బును సైకో ఎలా సంపాదించాడు? తన బిడ్డ ప్రాణాల్ని కాపాడుకున్నాడా లేదా? చిన్న పిల్లల అక్రమ రవాణాతోపాటు ఆయుధాలు సరఫరా చేసే కార్టెల్ సంస్థ నడుపుతున్న వికాస్ మాలిక్ (నవాజుద్దీన్ సిద్ధిఖీ), మిత్ర (ముఖేష్ రుషి)తో సైంధవ్ పోరాటం ఎలా సాగింది? అనే కథను చాలా ఆశక్తికరంగా, యాక్షన్ ఎలిమెంట్స్ తో తెరకెక్కించారు దర్శకుడు శైలేష్ కొలను.
Also Read : Alka Yagnik: సడెన్‌గా వినికిడి శక్తి కోల్పోయిన బాలీవుడ్ టాప్ సింగర్ !