Saif : ముంబై – దుండగుడల దాడిలో తీవ్రంగా గాయపడి ముంబై లోని లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఆయన ఆరోగ్యానికి సంబంధించి వైద్యులు హెల్త్ బులిటెన్ ను విడుదల చేశారు. దాడి ఘటనలో బలమైన గాయాలు అయ్యాయని, సైఫ్(Saif) కొడుకు తొందరగా ఆస్పత్రికి చేర్చడంతో గండం నుంచి గట్టెక్కాడని తెలిపారు.
Saif Ali Khan Health Updates
ప్రతిఘటించడంతో సైఫ్ వెన్నెముకకు బలమైన గాయమైందని, రక్తస్రావం కూడా అయ్యిందని, దీంతో వెంటనే రక్తం ప్రసరించకుండా కట్టుకట్టడం జరిగిందన్నారు. ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్ ను ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ) నుంచి స్పెషల్ రూమ్ కు తరలించడం జరుగుతుందన్నారు.
ఇంకా సైఫ్ అలీ ఖాన్ కోలుకునేందుకు కొంత సమయం పడుతుందని వెల్లడించారు. అయితే మరో మూడు రోజుల్లో తను డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా న్యూ ఇయర్ వేడుకలను కుటుంబంతో కలిసి సైఫ్ , కరీనా కపూర్ స్విట్జర్లాండ్ కు వెళ్లారు. అక్కడి నుంచి నేరుగా ముంబైలోని బాంద్రా నివాసానికి చేరుకున్నారు.
అంతలోనే ఈ దాడి ఘటన చోటు చేసుకుంది. ఇదిలా ఉండగా సైఫ్ ప్రస్తుతం పలు సినిమాలలో నటించాల్సి ఉంది.
Also Read : Kangana – Emergency Movie : కట్టి పడేసిన కంగనా ఎమర్జెన్సీ