Saif Ali Khan : ముంబై – ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కత్తిపోట్లకు గురై ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతానికి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నా తను ఇప్పటికే ఒప్పందం చేసుకున్న సినిమాలకు సంబంధించి ఎక్కువ ప్రభావం పడనుందని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. బాలీవుడ్ లో నటీ నటులకు, ఇతర సాంకేతిక నిపుణులకు భద్రత లేకుండా పోయిందన్న ఆందోళన నెలకొంది.
Saif Ali Khan Attack Updates
ఈ తరుణంలో సైఫ్ అలీ ఖాన్(Saif Ali Khan) దాడి ఘటనపై సీరియస్ గా స్పందించారు మరాఠా సీఎం దేవేంద్ర ఫడ్నవీస్. పూర్తి భద్రత కల్పిస్తున్నామని, ఘటన జరిగిన వెంటనే పోలీసులు స్పందించారని, ఇప్పటికే సీసీ టీవీ ఫుటేజ్ ను రిలీజ్ చేశారని, నిందితుడిని గుర్తించడం జరిగిందన్నారు. మొత్తం 10 బృందాలు రంగంలోకి దిగాయని వెల్లడించారు.
అయితే సైఫ్ అలీ ఖాన్ కోలుకునేందుకు ఇంకా చాలా సమయం పట్టేలా ఉంది. దుండగుడి దాడి ఘటనలో ఆరు చోట్ల కత్తిపోట్లకు గురయ్యాడు. కొరటాల శివ దర్శకత్వం వహించిన దేవర1లో ప్రతి నాయకుడిగా నటించాడు సైఫ్. దేవర-2వ పార్డ్ కూడా ఉంటుందని, తనే విలన్ అని ఇప్పటికే ప్రకటించాడు దర్శకుడు.
బాలీవుడ్ తో పాటు దక్షిణాది సినిమాలకు ఓకే చెప్పాడు సైఫ్ అలీ ఖాన్. ఆయా సినిమాల షూటింగ్ లపై తీవ్ర ప్రభావం పడనుంది. జువెల్ తీఫ్ ది రెడ్ సన్ చాప్టర్ , రేస్ -4, షూట్ అవుట్ ఎట్ బైకుల్లా సినిమాలలో నటించేందుకు ఒప్పందం చేసుకున్నాడు.
Also Read : Hero Vijay Sethupathi : రూటు మార్చిన విజయ్ సేతుపతి