Saif : ముంబై – దుండగుడి దాడిలో కత్తిపోట్లకు గురై ముంబై లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందంటూ స్పష్టం చేశారు సోదరి సబా పటౌడి.
Saif Ali Khan Health Updates
భాయ్ తో సమయం గడపడం సంతోషంగా ఉందన్నారు. జనవరి 16న తెల్లవారుజామున బాంద్రాలోని తన నివాసంలో పడుకుని ఉండగా దాడికి గురైనట్లు తెలిపారు. దొంగతనానికి ప్రయత్నించడం, పెనుగులాటలో తన సోదరుడు గాయపడడంతో వెంటనే ఆస్పత్రికి తరలించడం జరిగిందన్నారు.
ఇదిలా ఉండగా ఈ ఘటనలో రోజుకో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇద్దరు నిందితులు ఉన్నట్లు ఈ కేసులో గుర్తించారు. వీరిలో ఒకరు బంగ్లాదేశ్ కు చెందిన అక్రమంగా చొరబాటుకు గురైనట్లు గుర్తించారు. ఈ ఘటనలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు ఇప్పటికే ప్రకటించారు ముంబై పోలీస్ జోన్ 9 డీసీపీ దీక్షిత్ డికెడె .
ఇదే సమయంలో సైఫ్ అలీ ఖాన్ దాడి ఘటనలో సబా పటౌడి వేళ్లు విరాయి. ఇందుకు సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేసింది.
Also Read : Dil Raju Shocking – IT Raids : దిల్ రాజు ఇళ్లు..నివాసాలపై ఐటీ దాడులు