Sai Pallavi : కాశీ అన్నపూర్ణ దేవిని దర్శించుకున్న నటి సాయి పల్లవి

కాగా సాయి పల్లవి చేతిలో ఇప్పుడు పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి...

Sai Pallavi : నేచురల్ బ్యూటీ సాయి పల్లవి ప్రస్తుతం ఆధ్యాత్మిక యాత్రలో మునిగితేలుతోంది. తాజాగా కాశీకి వెళ్లిన ఆమె అక్కడి అన్నపూర్ణా దేవిని దర్శించుకుంది. ఈ సందర్భంగా బ్లూ కలర్ సల్వార్ సూట్, దుపట్టా, మెడలో బంతిపూల హారం, చేతికి రుద్రాక్షల దండతో అమ్మవారిని దర్శించుకుంది సాయి పల్లవి. సాయి పల్లవికి చెందిన ఓ ఫ్యాన్ క్లబ్ ఆమె కాశీ యాత్రకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా, అవి కాస్తా వైరల్ గా మారాయి.

Sai Pallavi Visit

కాగా సాయి పల్లవి చేతిలో ఇప్పుడు పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి.తెలుగులో నాగ చైతన్యతో కలిసి ఆమె నటించిన తండేల్ త్వరలోనే రిలీజ్ కానుంది. ఇక నితేష్ తివారీ తెరకెక్కిస్తోన్న రామాయణ సినిమాలో సీత పాత్రలో నటిస్తోందీ న్యాచురల్ బ్యూటీ. ఈ మూవీలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా కనిపించనున్నాడు. ఈ సినిమా తొలి భాగం 2026లో వచ్చే దీపావళికి, రెండో భాగం 2027లో వచ్చే దీపావళికి రిలీజ్ కానుంది. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

Also Read : Mohan Babu : ముందస్తు బెయిల్ పిటిషన్ ను కొట్టివేసిన తెలంగాణ హైకోర్టు

Sai PallaviTrendingUpdatesViral
Comments (0)
Add Comment