Sai Pallavi : బాలీవుడ్ పై లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి సంచలన వ్యాఖ్యలు

సాయిపల్లవి.. బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన సమయంలో ఒక వ్యక్తి తనకు ఫోన్‌ చేసి....

Sai Pallavi : సాయిపల్లవి.. పుట్టి పెరిగింది తమిళనాడే అయినా ప్రతీఒక్కరు తమ ఇంటిలోని అమ్మాయే అనుకునేంతగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది. టాలీవుడ్‌లో ఎన్నో హిట్‌ చిత్రాల్లో నటించిన ఆమె తాజాగా ‘రామాయణ’తో బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. ఈనేపథ్యంలోనే బాలీవుడ్‌ పీఆర్‌ ఏజెన్సీలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారామె. తరచూ లైమ్‌లైట్‌లో నిలవడం కోసం అక్కడి నటీనటులు పీఆర్‌ ఏజెన్సీలతో ఒప్పందాలు కుదుర్చుకుంటారని చెప్పారు.

Sai Pallavi Comment

సాయిపల్లవి.. బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన సమయంలో ఒక వ్యక్తి తనకు ఫోన్‌ చేసి.. దీనిగురించే అడిగారని అమరన్‌ ప్రమోషన్స్‌లో సాయిపల్లవి(Sai Pallavi) తెలిపారు. బాలీవుడ్‌కు చెందిన ఒక వ్యక్తి ఇటీవల నాకు ఫోన్‌ చేశారు. నన్ను నేను ప్రమోట్‌ చేసుకోవడానికి.. తరచూ వార్తల్లో నిలవడం కోసం పీఆర్‌ టీమ్‌ను నియమించుకుంటారా? అని అడిగాడు. అలా చేస్తే నేను లైమ్‌లైట్‌లో ఉండగలను. ప్రేక్షకులు తరచూ నా గురించి మాట్లాడుకుంటారు. దానివల్ల నాకు ఎలాంటి ఉపయోగం లేదనిపించింది. ఎందుకంటే, తరచూ నా గురించి మాట్లాడాలన్నా ప్రేక్షకులకు విసుగు వస్తుంది. అందుకే నాకు అలాంటిది ఏమీ అవసరం లేదని చెప్పా అని సాయిపల్లవి తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. బాలీవుడ్‌ సెలబ్రిటీలు తరచూ వార్తల్లో ఉండటానికి కారణం పీఆర్‌ బృందాలేనని పలువురు భావిస్తున్నారు. ఈమేరకు కామెంట్స్‌ చేస్తున్నారు.

రామాయణ ప్రాజెక్ట్‌ను నితేశ్‌ తివారీ ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. రణ్‌బీర్‌ కపూర్‌ రాముడిగా కనిపించనున్నారు. సీత పాత్రలో సాయిపల్లవి.. రావణుడిగా యశ్‌ నటిస్తున్నారు. ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉంది. ఇక అమరన్‌ విషయానికి వస్తే.. ఉగ్రదాడిలో అమరుడైన మేజర్‌ ముకుంద్‌ వరదరాజన్‌ జీవితాధారంగా ఈ సినిమా తెరకెక్కింది. శివ కార్తికేయన్‌, సాయిపల్లవి జంటగా నటించారు. దీపావళి కానుకగా అక్టోబర్‌ 31న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినీప్రియులను ఆకట్టుకుంటున్నాయి.

Also Read : SSMB29 Movie : మహేష్ బాబు, జక్కన్న కాంబినేషన్ సినిమాపై కీలక అప్డేట్

BollywoodCommentsSai PallaviViral
Comments (0)
Add Comment