Hero Chaitanya Thandel : గుండెల్ని మీట‌నున్న ‘తండేల్’

ఆక‌ట్టుకుంటున్న నేచుర‌ల్ స్టార్

Thandel : స‌హ‌జ సిద్ద‌మైన న‌ట‌న‌కు పేరు పొందింది సాయి ప‌ల్ల‌వి. త‌న స్వ‌స్థ‌లం కేర‌ళ‌. కానీ ప‌లు భాష‌ల్లో న‌టిస్తూ త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన న‌టిగా ప్రూవ్ చేసుకుంది. త‌మ ఇంటిల్లిపాది ఇష్ట‌ప‌డేలా, త‌మ ఇంట్లో మ‌నిషి లాగా ఉండే పాత్ర‌లనే ఎంపిక చేసుకుంటోంది. స‌క్సెస్ ఫెయిల్యూర్ ల‌ను ప‌ట్టించుకోకుండా త‌న ప‌ని తాను చేసుకుంటూ పోతోంది. సినీ రంగంలో వివాదాల‌కు దూరంగా ఉంటుంది.

Thandel Movie Updates

క్రియేటివ్ డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో స్టార్ హీరో అక్కినేని నాగ చైత‌న్య‌తో క‌లిసి చేసిన మూవీ ప్రేక్ష‌కుల‌ను ఆద‌రించింది. ఇదే కాంబినేష‌న్ లో తిరిగి మ‌రో మూవీ రాబోతోంది . దీనిని తండేల్(Thandel) పేరుతో తెర కెక్కించే ప్ర‌య‌త్నం చేశాడు. చందూ మొండేటి. త‌ను పూర్తిగా సాయి ప‌ల్ల‌విని నేచుర‌ల్ స్టార్ గా క్రియేట్ చేయ‌డంలో స‌క్సెస్ అయ్యాడని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఇది గ్రామీణ ప్రాంతం కేంద్రంగా క‌థ ఉండ‌బోతోంద‌ని స‌మాచారం. తండేల్ మూవీకి సంబంధించిన పోస్ట‌ర్స్ , టీజ‌ర్ కు భారీ ఎత్తున స్పంద‌న వ‌చ్చింది. తాజాగా విడుద‌ల చేసిన పోస్ట‌ర్ ప్రేక్ష‌కుల హృద‌యాల‌ను దోచుకుంటోంది. ఇందుకు సంబంధించి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. ప‌ల్లెత‌నం క‌ల‌బోసుకున్న పాత్ర‌లో లీన‌మై పోయింది సాయి ప‌ల్ల‌వి. ఈ మూవీ త‌న సినీ కెరీర్ లోనే గుర్తు పెట్టుకునేలా చేస్తుంద‌ని న‌మ్మ‌కం వ్య‌క్తం చేసింది.

Also Read : Victory Venkatesh Movie : స‌క్సెస్ క్రెడిట్ ప్రేక్ష‌క దేవుళ్ల‌దే

Akkineni Naga ChaitanyaCinemaSai PallaviThandelTrendingUpdates
Comments (0)
Add Comment