Sai Pallavi : సినిమా కోసం తన అలవాట్లు మార్చుకున్నారంటూ వస్తున్న వార్తలపై భగ్గుమన్న సాయి పల్లవి

ఈ సినిమాలో రాముడిగా రణ్‌బీర్‌, సీతగా సాయిపల్లవి నటిస్తున్నారు...

Sai Pallavi : లేడీ పవర్‌స్టార్‌ సాయి పల్లవి వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం బాలీవుడ్‌లో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ‘రామాయణ’లో సీతగా కనిపించేందుకు సిద్థమవుతున్నారు. తెలుగులో ‘తండేల్‌’ చిత్రం చేస్తున్నారు. అయితే, ‘రామయణ’ సినిమా కోసం సాయి పల్లవి(Sai Pallavi) తన అలవాట్లను మార్చుకున్నారంటూ వస్తోన్న వార్తలపై తాజాగా ఆమె ఘాటుగా స్పందించారు. ఇలాంటి నిరాధారమైన పోస్ట్‌లు పెడితే లీగల్‌ యాక్షన్‌ ఎదుర్కొవలసి వస్తుంది అంటూ ట్వీట్‌ చేశారు. బాలీవుడ్‌ నిర్మాతలతో కలిసి అల్లు అరవింద్‌ రామాయణాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. నితేశ్‌ తివారీ దర్శకత్వంలో ‘రామాయణ’గా ఇది రానుంది.

ఈ సినిమాలో రాముడిగా రణ్‌బీర్‌, సీతగా సాయిపల్లవి నటిస్తున్నారు. ఈ సినిమా కోసం ఆమె ఎన్నో అలవాట్లు మార్చుకున్నారని కోలీవుడ్‌లో ఓ ప్రముఖ మీచి?యా సంస్థ వార్తలు ప్రచురించింది.ఈ సినిమా పూర్తయ్యేవరకు సాయి పల్లవి(Sai Pallavi) మాంసాహారం మానేశారని, హోటల్స్‌లో కూడా తినడం లేదని, విదేశాలకు వెళ్లేటప్పుడు కూడా వంట వాళ్లను వెంట తీసుకెళ్తున్నారని ఆ వార్తలోని సారాంశం. దీనిపై తాజాగా సాయి పల్లవి స్పందించారు. ఇలాంటి రూమర్స్‌ రాస్తే ఎంత పెద్ద సంస్థ అయినా లీగల్‌ యాక్షన్‌ ఎదుర్కోవాల్సి వస్తుందంటూ ఆమె హెచ్చరించారు.

Sai Pallavi Comment

‘నా పైఎన్నోసార్లు రూమర్స్‌ వచ్చాయి. అలా వచ్చిన ప్రతిసారీ నేను మౌనంగానే ఉన్నాను. ఎందుకంటే నిజమేంటనేది దేవుడికి తెలుసు. కానీ, మౌనంగా ఉంటున్నానని ఇలాంటి రూమర్స్‌ తెగ రాస్తున్నారు. ఇప్పుడు ప్రతి స్పందించాల్సిన సమయం వచ్చింది. నా సినిమాల విడుదల, నా ప్రకటనలు, నా కెరీర్‌.. ఇలా నాకు సంబంధించి ఏవైనా నిరాధారమైన వార్తలు ప్రచురిేస్త.. అది గుర్తింపుపొందిన మీడియా అయినా నేను చట్టబద్దమైన యాక్షన్‌ తీసుకుంటాను. ఇన్నాళ్లు సహించాను. ఇకపై ఇలాంటి చెత్త కథనాలను మోసుకెళ్లడానికి నేను సిద్థంగా లేను’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఆమె చేసిన ఈ పోస్ట్‌ వైరల్‌గా మారింది. ఇటీవల అమరన్‌తో హిట్‌ అందుకున్న సాయి పల్లవి తెలుగులో తండేల్‌లో నటిస్తున్నారు. చందూ మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న చిత్రమిది.

Also Read : Vishwak Sen-Funky Movie : అనుదీప్ డైరెక్షన్ లో ఓ కొత్త ప్రాజెక్ట్ తో వస్తున్న విశ్వక్ సేన్

CommentsSai PallaviUpdatesViral
Comments (0)
Add Comment