Sai Pallavi: సపోరో స్నో ఫెస్టివల్ లో సాయిపల్లవి సందడి !

సపోరో స్నో ఫెస్టివల్ లో సాయిపల్లవి సందడి !

Sai Pallavi: నేచురల్ బ్యూటీ సాయి పల్లవి… జపాన్ లోని సపోరో ప్రాంతంలో జరగుతున్న స్నో ఫెస్టివల్ లో సందడి చేస్తున్నారు. అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ హీరోగా తెరకెక్కిస్తున్న తాజా సినిమాలో నటిస్తున్న సాయి పల్లవి… షూటింగ్ లో భాగంగా స్నో ఫెస్టివల్ లో ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం స్నో ఫెస్టివల్ లో పాల్గొన్న సాయిపల్లవి(Sai Pallavi) ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జపాన్‌ లోని సపోరో ప్రాంతంలో ప్రతీఏటా ఈ పండగ జరుగుతూ ఉంటుంది. అయితే స్నో ఫెస్టివల్ లో సినిమా షూటింగ్ లకు అనుమతించడం చాలా అరుదు.

అయితే సునిల్‌ పాండే దర్శకత్వంలో తన వారసుడు జునైద్ ఖాన్ హీరోగా సొంత ప్రోడక్షన్‌లో అమీర్‌ ఖాన్‌ ఈ సినిమాను నిర్మిస్తుడంతో షూటింగ్ కు పర్మిషన్ తెచ్చుకున్నారు. దీనితో అక్కడ జరుగుతున్న స్నో ఫెస్టివల్ లో సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. దీనితో స్నో ఫెస్టివల్ లోని జునైద్ ఖాన్, సాయి పల్లవిల వర్కింగ్ స్టిల్స్ నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.

Sai Pallavi Photos Viral

బాలీవుడ్ మిస్టర్ ఫెర్పెక్ట్ అమీర్ ఖాన్ తన నట వారసుడిని ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నారు. ‘మహరాజ్‌’ అనే సినిమా ద్వారా జునైద్‌ ఖాన్‌ హీరోగా త్వరలో పరిచయం కాబోతున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ కాకముందే రెండో సినిమాను అమీర్ ఖాన్ తన స్వంత బ్యానర్ పై నిర్మిస్తున్నారు. సునిల్ పాండే దర్శకత్వంలో జునైద్ ఖాన్, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా తెరకెక్కిస్తున్న రెండో సినిమా… ప్రస్తుతం జపాన్ లోని సపోరో ప్రాంతంలో స్నో ఫెస్టివల్ లో షూటింగ్ జరుపుకుంటోంది.

Also Read : Kamal Hasan: శింబు సినిమాలో కమల్‌ హాసన్‌ ?

Aamir KhanJunid KhanSai Pallavi
Comments (0)
Add Comment