Sai Pallavi : తన సోదరితో కలిసి ఆస్ట్రేలియా వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న సాయి పల్లవి

సముద్రంలో ఈత కొడుతూ.. జంతువులకు ఆహారం తినిపిస్తూ....

Sai Pallavi : సాయి పల్లవి ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరిస్తుంది. కానీ సోషల్ మీడియాలో అంతగా యాక్టివ్ గా ఉండదు. కానీ ఫ్యామిలీతో కలిసి ప్రయాణాలు, స్పెషల్ ఈవెంట్స్ అంటూ తెగ సందడి చేస్తుంది. తాజాగా సాయి పల్లవి(Sai Pallavi) తన ఇన్ స్టాలో షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం తన చెల్లితో కలిసి ఆస్ర్టేలియాలో వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది. తన చెల్లెలు పూజా కన్నన్, స్నేహితులతో కలిసి ఈ వెకేషన్ వెళ్లినట్లుగా తెలుస్తోంది. ‘ప్రేమించే వ్యక్తులతో ఒక అందమైన ప్రయాణాన్ని గుర్తుంచుకోవడానికి, సాహసం, ఒక చిన్న నవ్వు’ అనే క్యాప్షన్‌తో సాయి పల్లవి ఫోటోస్ షేర్ చేసింది. ప్రస్తుతం సాయి పల్లవి షేర్ చేసిన ఫోటోస్ వైరలవుతున్నాయి.

Sai Pallavi Vacation

సముద్రంలో ఈత కొడుతూ.. జంతువులకు ఆహారం తినిపిస్తూ.. విమానం నుంచి ఫోటోస్ షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ముద్దుగమ్మ షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి. ‘ఇంత అందంగా ఎలా ఉన్నావు’, ‘ఆమె దేవత కదా’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అమరన్ సినిమాతో మరో హిట్ అందుకున్న సాయి పల్లవి.. ప్రస్తుతం తండేల్ చిత్రంలో నటిస్తుంది. ఇందులో అక్కినేని నాగ చైతన్య హీరోగా నటిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ అడియన్స్ ముందుకు రానుంది.

Also Read : Barroz 3D Movie : ‘బరోజ్ 3డీ’ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మలయాళ అగ్ర హీరో

Exotic Vacation DestinationsSai PallaviTrendingUpdatesViral
Comments (0)
Add Comment