Sai Pallavi : అమీర్ త‌న‌యుడితో సాయి ప‌ల్ల‌వి

బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వ‌నున్న న‌టి

Sai Pallavi : సినీ రంగంలో విల‌క్ష‌ణ‌మైన న‌టిగా గుర్తింపు తెచ్చుకుంది సాయి ప‌ల్ల‌వి. ఎలాంటి ఎక్స్ పోజ్ లేకుండా కేవ‌లం క‌థ‌కు ప్రాధాన్య‌త ఉండే పాత్ర‌ల‌ను ఎంపిక చేసుకుంటూ వ‌స్తోంది. ద‌ర్శ‌కుల ఛాయిస్ గా త‌న‌ను తాను ప్రూవ్ చేసుకుంది.

Sai Pallavi Movie Updates

తాజాగా సాయి ప‌ల్ల‌వి నుండి అప్ డేట్ వ‌చ్చింది. ఈ మేర‌కు ప్రేమ క‌థ‌ను తెర‌కెక్కించే ప్ర‌య‌త్నంలో భాగంగా సంత‌కం చేసిన‌ట్లు సినీ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్ప‌టికే త‌ను న‌టించిన సినిమాలు మంచి ఆద‌ర‌ణ చూర‌గొన్నాయి.

మినిమం గ్యారెంటీ ఉన్న న‌టిగా పేరు పొందింది సాయి ప‌ల్ల‌వి. కాగా ఆ చిత్రం బాలీవుడ్ కు సంబంధించింద‌ని టాక్. ప్ర‌ముఖ న‌టుడు అమీర్ ఖాన్ త‌న‌యుడు జునైద్ ఖాన్ కు జోడీగా సాయి ప‌ల్ల‌వి(Sai Pallavi) న‌టిస్తున్న‌ట్టు స‌మాచారం.

చాలా చిత్రాల‌లో న‌టించ‌మ‌ని ఆఫ‌ర్లు వ‌చ్చినా తిర‌స్క‌రించింది. త‌నకు న‌చ్చితేనే ఓకే చెబుతుంది లేదంటే ఖ‌రాఖండిగా నో చెప్పేస్తుంది సాయి ప‌ల్ల‌వి. సునీల్ పాండే ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. జునైద్ ఖాన్ కు ఇది ఛాలెంజింగ్ పాత్ర .

విరాట ప‌ర్వం త‌ర్వాత సాయి ప‌ల్ల‌వి న‌టిస్తున్న చిత్రం ఇదే కావ‌డం విశేషం.

Also Read : Mark Antony Movie : విశాల్ మార్క్ ఆంటోనీ రెడీ

Comments (0)
Add Comment