Sai Durgha Tej : పుష్ప రాజ్ పై సాయి దుర్గా తేజ్ కీలక వ్యాఖ్యలు

'పుష్ప2' రిలీజ్ నేపథ్యంలో సాయి దుర్గా తేజ్ ట్వీట్ చేస్తూ....

Sai Durgha Tej : ఏపీ ఎన్నికల తర్వాత నుండి తెలుగు రాష్ట్రాల్లో మెగా వర్సెస్ అల్లు అనే టాపిక్ సోషల్ మీడియా మాధ్యమాల్లో రచ్చగా మారింది. మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య గ్యాప్ పెరిగిందని ఫ్యాన్స్ కూడా రెండు వర్గాలుగా విడిపోయి కొట్టుకున్నారు. ఈ తరుణంలోనే బన్నీ ‘పుష్ప 2’ సినిమా రిలీజ్ ఉండటంతో సోషల్ మీడియాలో మరింత రచ్చ జరుగుతోంది. ‘పుష్ప 2’ సినిమాపై ఏ మెగా హీరో కూడా స్పందించకపోవడంతో కొందరు మెగా ఫ్యాన్స్ ఈ సినిమాని అవాయిడ్ చేసేందుకు సిద్ధపడ్డారు. ఈ క్రమంలోనే మెగా హీరో సాయి దుర్గా తేజ్(Sai Durgha Tej) ట్వీట్ వైరల్‌గా మారింది.

Sai Durgha Tej Comment

‘పుష్ప2’ రిలీజ్ నేపథ్యంలో సాయి దుర్గా తేజ్ ట్వీట్ చేస్తూ.. పుష్ప టీమ్‌కి శుభాకాంక్షలు తెలియజేశాడు. అలాగే ‘సెండింగ్ మై హార్ట్‌ఫెల్ట్ విషెస్ టూ’ అంటూ అల్లు అర్జున్, సుకుమార్, దేవి శ్రీ ప్రసాద్, ఫహద్ ఫాసిల్, రష్మిక మందన్న, రసూల్ పూకుట్టి, మైత్రీ, సుకుమార్ నిర్మాణ సంస్థలను ట్యాగ్ చేశాడు. దీంతో మెగా, అల్లు మ్యూచ్‌వల్ ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు. ఇప్పటికైనా మెగా, అల్లు గొడవలు సర్దుకొని అందరు ఒకటి కావాలని కోరుకుంటున్నారు. మరికొన్ని గంటల్లో ‘పుష్ప2’ ఆరు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా 12 వేల థియేటర్‌లలో విడుదల కానుంది. ‘‘అత్యధిక థియేటర్లలో ఐమాక్స్‌ ఫార్మాట్‌లో విడుదలవుతున్న భారతీయ చిత్రమిది. సినీడబ్స్‌ యాప్‌ సహాయంతో ఏ భాషతోనైనా ఈ సినిమాని చూసే అవకాశం ఉందని నిర్మాతలు చెప్పారు.

Also Read : Dushara Vijayan : తన పెళ్లిపై కీలక అంశాలను వెల్లడించిన ‘రాయన్’ సినిమా నటి

CommentsPushpaSai Durgha TejUpdatesViral
Comments (0)
Add Comment