Sai Durgha Tej: సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుండే ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ. రీసెంట్‌గా సంభవించిన ఏపీ, తెలంగాణ వరదలకు ఎంతో మంది బాధితులుగా నిలిచారు. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ప్రిన్స్ వరుణ్ తేజ్, మెగా డాటర్ నిహారిక, సుప్రీంహీరో సాయి దుర్గా తేజ్ ఇలా… ఎవరికి వారు ముందుకు వచ్చి వరద బాధితులకు తమ వంతు సహాయం అందించారు. ఈ నేపథ్యంలో తను ప్రకటించిన సాయాన్ని అందజేసేందుకు స్వయంగా సాయిదుర్గ తేజ్ విజయవాడకు వెళ్లారు. అక్కడ మినిస్టర్ నారా లోకేష్‌ని కలిసి.. సీఎం సహాయనిధికి ప్రకటించిన రూ. 10 లక్షల చెక్‌ను అందజేశారు. అలాగా సేవా సంస్థలకు ప్రకటించిన రూ. 5 లక్షల్లో అమ్మ అనాథశ్రమానికి 2 లక్షల రూపాయలు, ఇతర సేవా సంస్థలకు 3 లక్షల రూపాయల విరాళం అందించారు. తెలంగాణ రాష్ట్రానికి కూడా సాయిదుర్గ తేజ్ రూ. 10 లక్షల సాయం ప్రకటించిన విషయం తెలిసిందే.
Sai Durgha Tej Helps..
ఇక సాయిదుర్గ తేజ్ విజయవాడ పర్యటనలో భాగంగా.. మొదట శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శనం చేసుకుని ఆశీస్సులు అందుకున్నారు. ఆ తర్వాత అమ్మ అనాథాశ్రమానికి వెళ్లి అక్కడి వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. అమ్మ ఆశ్రమానికి సొంత భవనం కట్టిస్తానని 2019లో తన పుట్టినరోజున మాటిచ్చిన సాయి దుర్గతేజ్(Sai Durgha Tej)… చెప్పినట్లుగానే 2021లో బిల్డింగ్ కట్టించి ఇచ్చారు. మూడేళ్ల పాటు అమ్మ అనాథాశ్రమాన్ని దత్తత తీసుకుని మొత్తం ఖర్చులన్నీ భరించారు. సాయి దుర్గతేజ్ మంచి మనసుకు ఆశ్రమవాసులతో పాటు ప్రజలందరి ప్రశంసలు దక్కాయి. అమ్మ అనాథాశ్రమానికి విరాళం అందించిన అనంతరం ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ని కలిసి రూ. 10 లక్షల చెక్‌ని అందజేశారు. మేనమామ, ఏపీ డిఫ్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నుంచి సేవా గుణాన్ని పుణికిపుచ్చుకున్న సాయి దుర్గతేజ్ భవిష్యత్‌లోనూ తనకు వీలైనంతగా సేవా కార్యక్రమాలు చేస్తూ సమాజానికి తనవంతుగా అండగా నిలబడాలని భావిస్తున్నారు.
Also Read : Viswam: గోపీచంద్ ‘విశ్వం’ నుండి మొరాకో మగువా సాంగ్ రిలీజ్ !