Sai Durgha Tej : తాను రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంపై క్లారిటీ ఇచ్చిన సుప్రీమ్ హీరో

అంతే కాదు.. గతంలో జరిగిన యాక్సిడెంట్‌ గురించి గుర్తు చేసుకున్నారు...

Sai Durgha Tej : రాజకీయాల్లోకి అడుగుపెట్టడంపై తన అభిప్రాయాన్ని తెలియజేశారు నటుడు, మెగా మేనల్లుడు సాయిదుర్గా తేజ్‌(Sai Durgha Tej) శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన ఓ సెషన్‌లో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం చూస్తున్న రాజకీయాల్లోకి అడుగుపెట్టాంటే ఎన్నో విషయాలపై అవగాహన కలిగిఉండాలని ఆయన అన్నారు. ‘‘ నాకు తెలిసింది సినిమా మాత్రమే ప్రస్తుతం నా ఫోకస్‌ అంతా సినిమాలపైనే ఉంది. మరెన్నో విభిన్నమైన చిత్రాలు, వైవిధ్యమైన పాత్రలు చేయాలి, ప్రేక్షకుల్ని అలరించాలి. రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన ప్రస్తుతానికి లేదు. అటువైపు అడుగేయాలంటే ఎన్నో విషయాలు నేర్చుకోవాలి. ప్రజా సమస్యలపై పూర్తిగా అవగాహన కలిగి ఉండాలి’’ అని తేజ్‌ అన్నారు.

Sai Durgha Tej Comment

అంతే కాదు.. గతంలో జరిగిన యాక్సిడెంట్‌ గురించి గుర్తు చేసుకున్నారు. దాని నుంచి బయటపడటంతో తనకు పునర్జన్మ అని అన్నారు. ఆ ప్రమాదం తర్వాత దాదాపు రెండు వారాలు తాను కోమాలోనే ఉన్నానని చెప్పారు. ద్విచక్ర వాహనాలు నడిపేవారు తప్పకుండా హెల్మెట్‌ ధరించాలని, అదే తన ప్రాణాలను కాపాడిందని తెలిపారు. సినిమాల విషయానికి వస్తే. యాక్సిడెంట్‌ తర్వాత లైఫ్‌ అంటే ఏంటో తెలిసిందని అన్న ఆయన కెరీర్‌ విషయంలో ఆచితూచి అడుగేస్తున్నానని చెప్పారు. గతేడాది ఆయన నటించిన ‘విరూపాక్ష’, ‘బ్రో’ చిత్రాలు విడుదలయ్యాయి. ప్రస్తుతం ఆయన రోహిత్‌ కేపీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు.

Also Read : Aamir Khan : ఆ ప్రముఖ గాయకుడి బయోపిక్ కు అమీర్ ఖాన్ హీరోనా..

CommentpoliticsSai Durgha TejUpdatesViral
Comments (0)
Add Comment