SDT18 : విరూపాక్ష వంటి బ్లాక్‌బస్టర్ చిత్రం తర్వాత మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్(Sai Durgha Tej) నటిస్తోన్న కొత్త చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే. రోహిత్ కెపి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను హనుమాన్ వంటి భారీ చిత్రాన్ని అందించిన నిర్మాతలు కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్పై ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను హై బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
SDT18 Movie Updates
తాజాగా హీరో సాయు దుర్గ తేజ్ జన్మదినం సందర్భంగా మేకర్స్ సినిమా మేకింగ్ వీడియోను, రిలీజ్ చేశారు. ఈ మేకింగ్ వీడియో అదిరిపోయే రెస్పాన్స్‌ను దక్కించుకుంటుంది. ముఖ్యంగా సాయి దుర్గ తేజ్ విరూపాక్ష సినిమా తర్వాత తనకు తానుగా ట్రాన్స్‌ఫర్మ్ అయిన విదానం కట్టి పడేసేలా ఉంది. విజువల్స్ ఎక్ట్రార్టినరీగా ఉన్నాయి. ఇటీవలే ప్రముఖ ఫైట్ మాస్టర్స్ కొరియోగ్రాఫ్ చేసిన 15 రోజుల యాక్షన్-ప్యాక్డ్ షెడ్యూల్ పూర్తి చేసింది. మునుపెన్నడూ చూడని యాక్షన్ సీక్వెన్స్‌లలో సాయి దుర్గ తేజ్ పవర్ ఫుల్ మాస్ అవతార్‌లో ఇందులో కనిపించనున్నాడు. హై-ఆక్టేన్ స్టంట్స్, డైనమిక్ ఫైట్ సీన్స్ ప్రేక్షకులకు సరికొత్త థ్రిల్ అందిస్తాడని మేకర్స్ స్పష్టం చేశారు. ఈ చిత్రంలో సాయి సరసన ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్-ఇండియా మూవీ విడుదల కానుంది. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే మేకర్స్ తెలియజేయనున్నారు.
Also Read : Nikhila Vimal : డైరెక్టర్ నచ్చిన రీతిలో ఆ పాత్రకు తగ్గట్టు మలచుకున్నారు