Sai Durga Tej: మేనమామల ఆశీస్సులు తీసుకున్న సాయి దుర్గ తేజ్ !

మేనమామల ఆశీస్సులు తీసుకున్న సాయి దుర్గ తేజ్ !

Sai Durga Tej: మెగా మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌… ఇటీవల పేరు మార్చుకున్న సంగతి తెలిసిందే. తన తల్లి పేరులో దుర్గను కలిపి సాయి దుర్గ తేజ్‌(Sai Durga Tej) గా తన పేరును మార్చుకున్నట్లు ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రకటించారు. అలాగే తన తల్లి విజయ దుర్గ పేరుతో నూతనంగా విజయ దుర్గా ప్రొడక్షన్ హౌస్‌ ను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో విజయ దుర్గా ప్రొడక్షన్ హౌస్ కు సంబంధించిన లోగోను ఆయన విడుదల చేశారు. ఈ మేరకు మేనమామలు చిరంజీవి, నాగబాబు, పవన్ కల్యాణ్‌ ఆశీస్సులు తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆయన తన సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.

Sai Durga Tej Taken Blessings

“నా మాతృమూర్తి విజయదుర్గగారికి చిన్న బహుమతిగా ఆమె పేరుతో కొత్త ప్రొడక్షన్ హౌస్‌ ప్రారంభించాను. మా మావయ్యలు చిరంజీవిగారు, నాగబాబు, అలాగే నా గురువు పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో దీన్ని ప్రారంభించాను. నా కెరీర్‌ తొలినాళ్లలో నాకు సహకరించిన నిర్మాత దిల్‌రాజు, నా మిత్రులు నవీన్ విజయ్‌కృష్ణ, హర్షిత్ శ్రీ, ‘సత్య’ సినిమా టీమ్‌తో కలిసి ఈ సంస్థను ప్రారంభించడం సంతోషంగా ఉంది’’ అని సాయి దుర్గ తేజ్ ఇన్ స్టాలో పోస్ట్‌ చేశారు.

Also Read : Balakrishna : బాలయ్య బాబు సినిమాకి నో చెప్పిన ఆ హోమ్లీ బ్యూటీ..

Megastar Chiranjeevipawan kalyanSai Durga Tej
Comments (0)
Add Comment