Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఎలాగైనా సరే తాను నటిస్తున్న విశ్వంభరను సాధ్యమైనంత త్వరలో పూర్తి చేయాలని ఫోకస్ పెట్టాడు. ఆ మేరకు రేయింబవళ్లు తన పాత్రకు మరింత న్యాయం చేయాలని పరితపిస్తున్నాడు. గతంలో తాను నటించిన వాల్తేర్ వీరయ్య బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆచార్య ఆశించిన మేర ఆడలేదు.
Sai Durga Tej in Chiranjeevi Movie
కొంత గ్యాప్ తర్వాత విశ్వంభర తెరకెక్కుతోంది. మెగా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు ఈ చిత్రంపై. ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. మరో వైపు సినిమా షూటింగ్ ఆఖరి దశలో ఉండడంతో దర్శకులతో చర్చలు జరుపుతున్నారు. తదుపరి చిత్రం కోసం మినిమం గ్యారెంటీ డైరెక్టర్ గా పేరు పొందిన అనిల్ రావిపూడితో కథా చర్చలు ముగిశాయి. తనతో నటించేందుకు ఒకే కూడా చెప్పాడు. దీంతో రాబోయే ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.
తను వెంకటేశ్ తో తీసిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇది ఏకంగా రూ. 330 కోట్లకు పైగా వసూలు చేసింద. కామెడీకి ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చే అనిల్ మెగాస్టార్ తో భిన్నమైన పాత్రను చేయించేందుకు రెడీ అవుతున్నట్లు టాక్.
ఇదిలా ఉండగా తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త గుప్పుమంటోంది. అదేమిటంటే మెగాస్టార్ ఫ్యామిలీకి చెందిన మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) మేనల్లుడు సాయి దుర్గా తేజ్ విశ్వంభర చిత్రంలో అతిథి పాత్రలో నటించనున్నట్లు సమాచారం.
Also Read : Daaku Maharaaj Sensational :నెట్ ఫ్లిక్స్ లో డాకు మహారాజ్ స్ట్రీమింగ్