Sai Dharam Tej: “విరూపాక్ష” మరియు “బ్రో” సినిమాలతో మంచి విజయాలు అందుకున్న సాయి ధరమ్ తేజ్… ఆ తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్నారు. ఇటీవల తన ముద్దుల మామయ్య, గురువుగా చెప్పుకునే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ తరువాత పవన్ కళ్యాణ్ ఘన విజయం సాధించడంతో పాటు… కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఏర్పాటులో కీలకంగా మారడంతో మెగా ఫ్యామిలీ ఇంట జరుగుతున్న విజయోత్సవ సంబరాల్లో మునిగి తేలాడు. ఇటీవల తిరుమల మెట్లమార్గంలో కాలినడనక వెళ్ళి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అయితే షూటింగ్ కు సినిమాలకు కాస్తా గ్యాప్ ఇచ్చిన ఈ యువ మెగా హీరో… ఈ సారి భారీ ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
Sai Dharam Tej Movie Updates
ఇప్పుడు ఓ పీరియాడిక్ యాక్షన్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ ప్రాజెక్ట్‌కి రోహిత్ కెపీ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఇటీవల విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో ఎడారి భూమిలో పచ్చని చెట్టు ఉండడం, ల్యాండ్ మైన్‌లు చుట్టుముట్టిన దృశ్యం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ పోస్టర్ బట్టి ఈ సినిమా ఒక యూనివర్సల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతుందని అనిపిస్తోంది. ఇప్పటికే విరుపాక్ష సినిమాతో సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) బాక్సాఫీస్ వద్ద బిగ్ సక్సెస్ అందుకున్నాడు. ఆ సినిమా 100 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకొని మంచి బూస్ట్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు SDT18 వర్కింగ్ టైటిల్ తో రాబోతున్న కొత్త సినిమాపై ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు తెలుస్తోంది.
ఆ ప్రాజెక్టు పై నిర్మాతలు మాట్లాడుతూ, “ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో, గ్రాండ్ స్కేల్‌తో రూపొందుతుంది. సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) పాత్ర చాలా శక్తివంతంగా ఉంటుంది. ప్రస్తుతం ఈ సినిమా కోసం నిర్మించిన ఒక భారీ సెట్‌లో మొదటి షెడ్యూల్ జరుగుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తాం,” అని అన్నారు. ఈ ప్రాజెక్ట్ తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతుంది. “విరూపాక్ష” మరియు “బ్రో” వంటి విజయాల తర్వాత, సాయి ధరమ్ తేజ్ మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీనితో ఈ సినిమా పై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి.
Also Read : Shruti Haasan: నెటిజన్‌పై శ్రుతీహాసన్ ఆగ్రహం కారణం ఏంటంటే ?