Sai Dharam Tej: సాయిధరమ్ తేజ్‌ ‘సత్య’ కు 8 అంతర్జాతీయ అవార్డులు !

సాయిధరమ్ తేజ్‌ ‘సత్య’ కు 8 అంతర్జాతీయ అవార్డులు !

Sai Dharam Tej: విరూపాక్ష, బ్రో సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ సాధించిన సాయి ధరమ్ తేజ్ నటించిన తాజా షార్ట్ ఫిల్మ్ ‘సత్య’. ఎమోషనల్, ప్రేమ, దేశభక్తి అంశాలు ఉన్న సత్య అనే కాన్సెప్ట్ లతో తన స్నేహితులతో కలిసి నిర్మించిన ఈ షార్ట్ ఫిల్మ్ లో సాయి ధరమ్ తేజ్ సరసన కలర్స్ స్వాతి నటించగా… సీనియర్ నటుడు తనయుడు విజయ్ కృష్ణ దర్శకత్వం వహించారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా ‘సోల్ ఆఫ్ స‌త్య’ పేరుతో గతేడాది ఆగస్టు 15న విడుదల చేసిన సాంగ్‌ మంచి ఆదరణ పొందింది. ఈ షార్ట్‌ ఫిల్మ్ ను న్యూయార్క్‌లోని అంతర్జాతీయ ఒనిరోస్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేదికలో ప్రదర్శించగా… అక్కడ రెండు అవార్డులు గెలిచింది. గతేడాది డిసెంబర్‌ 9న హాలీవుడ్‌ బీఎల్‌వీడీ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రదర్శించారు.

Sai Dharam Tej Movie Got Awards

ఇప్పటికే పలు అంతర్జాతీయ ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌ లో ప్రదర్శితమై అవార్డులు సొంతం చేసుకున్నసాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) ‘సత్య’… ఇప్పుడు మరో అరుదైన గౌరవం దక్కించుకుంది. ఫ్రాన్స్ లో జరిగిన టౌలౌజ్‌ షార్ట్స్‌ ఫెస్ట్‌ లో ఏకంగా 8 అవార్డులు దక్కించుకుంది ఈ ‘సత్య’ సినిమా. బెస్ట్‌ యాక్టర్‌, బెస్ట్‌ యాక్ట్రెస్‌, బెస్ట్‌ సౌండ్ డిజైన్‌, బెస్ట్‌ ఎడిటింగ్‌, బెస్ట్‌ సినిమాటోగ్రఫీ, బెస్ట్‌ ప్రొడ్యూసర్, బెస్ట్‌ డెబ్యూ డైరెక్టర్‌, బెస్ట్‌ ఇండీ షార్ట్‌ విభాగాల్లో ఈ సినిమాను ఎనిమిది పురస్కారాలు వరించాయి. ఇదే విషయాన్ని ఈ షార్ట్ ఫిల్మ్ నిర్మాణ సంస్థ దిల్‌ రాజు ప్రొడక్షన్స్‌ తన సోషల్‌ మీడియా వేదికగా తెలియజేస్తూ ఆనందం వ్యక్తంచేసింది. ఈ పోస్ట్‌ పై స్పందించిన… హీరో సాయిధరమ్‌ తేజ్‌, మంచి సినిమా ఎప్పుడూ టాప్‌ లోనే ఉంటుందని కామెంట్ పెట్టారు.

‘విరూపాక్ష’, ‘బ్రో’ చిత్రాలతో అలరించిన సాయి ధరమ్ తేజ్‌… ప్రస్తుతం ‘గాంజా శంకర్‌’ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. సంపత్‌ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్ మెంట్ నిర్మిస్తోంది.

Also Read : Allu Arjun: బెర్లిన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ కు అతిధిగా అల్లు అర్జున్‌ !

Sai Dharam TejSatya
Comments (0)
Add Comment