Sai Dharam Tej: ‘స‌లార్’ పై సాయిధరమ్ పోస్ట్ వైరల్

‘స‌లార్’ పై సాయిధరమ్ పోస్ట్ వైరల్

Sai Dharam Tej: పాజిటివ్ మైండ్‌సెట్‌తో ఉండే అతి తక్కువ మంది హీరోల్లో సాయిధ‌ర‌మ్ తేజ్(Sai Dharam Tej) ఒక‌రు. మెగా కుటుంబం నుండి వచ్చినప్పటికీ ఎల్ల‌ప్పుడూ సినిమా గెల‌వాల‌ని, అందులో తెలుగు సినిమా ఎప్పుడూ ముందుండాల‌ని కోరుకుంటాడు సాయిధ‌ర‌మ్ తేజ‌్. అయితే రెండు రోజుల వ్యవధిలో బాక్సాఫీసు ముందు పోటీ పడుతున్న సలార్, డంకీ, అక్వామెన్‌ సినిమాలపై తాజాగా ఆయన ఓ ఎమోషనల్ నోట్ ను విడుదల చేసారు. సోష‌ల్‌ మీడియా వేదిక‌గా విడుదల చేసిన ఆ పోస్ట్ వైర‌ల్‌గా మార‌ట‌మే కాదు… ప్రస్తుతం సినీ ప్రియుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోంది.

Sai Dharam Tej – సాయిధరమ్ నోట్ లో ఏముందంటే ?

‘‘తెలుగు సినిమా త‌న స‌క్సెస్‌ఫుల్ ప్ర‌యాణంలో నేడు ఉన్న‌త‌స్థితికి చేరుకుంది. మ‌న తెలుగు సినిమా ‘స‌లార్’ బాలీవుడ్ బాద్ షా షారుఖ్‌ఖాన్ నటించిన ‘డంకీ’, హాలీవుడ్ ఫిలిం ‘అక్వామెన్‌’తో స‌రిస‌మాన‌మైన క్రేజ్‌తో రెండు రోజుల వ్యవధిలో రిలీజ్ అవ్వ‌డం ఎంతో సంతోషంగా, గ‌ర్వంగా వుంది. హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ ఇలా మూడు అగ్ర సినీ ప‌రిశ్ర‌మ‌లు ఒకే స‌మ‌యాన ప్రేక్ష‌కుల‌కు అద్భుత‌మైన సినిమాటిక్ అనుభూతికి ఇవ్వ‌డానికి సిద్ధం కావ‌డం గొప్ప విష‌యం.

అన్నిటికంటే ఈ రోజు సినిమా చాలా అగ్ర‌స్థాయిలో వున్న ఫీల్ క‌లుగుతుంది. ఈ అనుభూతి క‌ల‌గ‌డానికి కార‌ణ‌మైన ప్ర‌తి ఒక్క‌రికీ నా ధ‌న్య‌వాదాలు. ‘డంకీ’ చిత్రంతో వ‌రుస‌గా మూడు స‌క్సెస్‌ల‌తో హ్యాట్రిక్ స‌క్సెస్ సాధించిన షారుఖ్ సార్‌.. యువ‌ర్ క‌మ్ బ్యాక్ ఈజ్ సో గ్రేట్‌. ‘స‌లార్‌’తో వెండితెర‌పై ఫైర్ క్రియేట్ చేయ‌డానికి సిద్ధమైన ప్ర‌భాస్ అన్న‌కు, అక్వామెన్ సినిమాకు బెస్ట్ ఆఫ్ ల‌క్‌ చెబుతున్నాను’’ అంటూ సాయిధ‌ర‌మ్ తేజ్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ చేసిన పోస్ట్ టాక్ ఆఫ్ ద టాలీవుడ్‌గా మారింది.

Also Read : Prabhas Salaar : ప్రభాస్ నటించిన సాలార్ ప్రీ-సేల్స్‌లో రూ. 30 కోట్లకు పైగా వసూళ్లు

dunkiSai Dharam TejSalaar
Comments (0)
Add Comment