Sai Dharam Tej: మెగా హీరో సాయిధరమ్ తేజ్ పేరు మార్చుకున్నాడు. తన తల్లి దుర్గ పేరును తన పేరుకు జోడించి సాయిదుర్గ తేజ్ గా నామకరణం చేసుకున్నాడు. అమ్మ ఎప్పటికీ తనతో ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మెగా హీరో తెలిపాడు. ఇక నుండి తన పేరు మెగా సాయిదుర్గ తేజ్(Sai Dharam Tej) గా చలామణీలో ఉంటుందని స్పష్టం చేసారు. అంతేకాదు తన తల్లి పేరు మీద దుర్గ ప్రొడక్షన్స్ బ్యానర్ ప్రారంభించినట్లు తెలిపాడు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా సాయిదుర్గా తేజ్ ప్రత్యేకంగా మీడియా సమావేశం నిర్వహించి ఈ విషయాలను వెల్లడించారు. ఈ బ్యానర్ ద్వారానే సోల్ ఆఫ్ సత్య షార్ట్ ఫిలిం తెరకెక్కిందని పేర్కొన్నాడు. ఇప్పటికే సోల్ ఆఫ్ సత్య షార్ట్ ఫిలిం అనేక జాతీయ అంతర్జాతీయ అవార్డులను గెలుచుకుంది. ఈ నేపథ్యంలో సాయిదుర్గ తేజ్ కు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Sai Dharam Tej – మొదటి ఫిల్మ్ తోనే అంతర్జాతీయ అవార్డులు సొంతం చేసుకున్న దుర్గ ప్రొడక్షన్స్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా ‘సోల్ ఆఫ్ సత్య’ పేరుతో గతేడాది ఆగస్టు 15న విడుదల చేసిన సాంగ్ మంచి ఆదరణ పొందింది. ఈ షార్ట్ ఫిల్మ్ ను న్యూయార్క్‌లోని అంతర్జాతీయ ఒనిరోస్ ఫిల్మ్ అవార్డ్స్ వేదికలో ప్రదర్శించగా… అక్కడ రెండు అవార్డులు గెలిచింది. గతేడాది డిసెంబర్ 9న హాలీవుడ్ బీఎల్‌వీడీ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించారు. ఇటీవల ఫ్రాన్స్ లో జరిగిన టౌలౌజ్ షార్ట్స్ ఫెస్ట్ లో ఏకంగా 8 అవార్డులు దక్కించుకుంది ఈ ‘సత్య’ సినిమా. బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ సౌండ్ డిజైన్, బెస్ట్ ఎడిటింగ్, బెస్ట్ సినిమాటోగ్రఫీ, బెస్ట్ ప్రొడ్యూసర్, బెస్ట్ డెబ్యూ డైరెక్టర్, బెస్ట్ ఇండీ షార్ట్ విభాగాల్లో ఈ సినిమాను ఎనిమిది పురస్కారాలు వరించాయి.
Also Read : Hanuman: ‘హను-మాన్’ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ ! కాని కండీషన్స్ అప్లై !