Sai Abhyankkar : ఎవరీ సాయి అభ్యాంకర్ అనుకుంటున్నారా. అత్యంత చిన్న వయసులోనే ఇంటర్నేషనల్ మూవీకి సంగీతం అందించబోతున్నాడా. అవుననే సమాధానం వస్తోంది సోషల్ మీడియా వేదికగా. ఈ సాయి అభ్యాంకర్(Sai Abhyankkar) తమిళ సినీ రంగంలో ఎగసి పడుతున్న సంగీత కెరటం. తను నవంబర్ 4, 2004లో పుట్టాడు. స్వరకర్తనే కాదు గాయకుడు కూడా. తల్లిదండ్రులు టిప్పు, హరిణి. కచ్చి సెరా, ఆసా కూడా, సిధిర పుత్తిరా సాంగ్స్ తో దుమ్ము రేపాడు. మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి. ప్రస్తుతం తను సంచలనంగా మారాడు.
Sai Abhyankkar – Sensational Music
దీనికి కారణం ఇండియన్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , స్టార్ డైరెక్టర్ అట్లీ కుమార్ కాంబినేషన్ లో త్వరలోనే మూవీ రాబోతోంది. ఇందుకు సంబంధించి సన్ ఇంటర్నేషనల్ అధినేత కళానిధి మారన్ నిర్మాణ సారథ్యంలో ఇది రూపు దిద్దుకోనుంది. భారీ బడ్జెట్ కేటాయించినట్లు సమాచారం. దేశంలో ఏ హీరోకు లేనంతటి రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు మారన్ సిద్దమైనట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. తను ఎవరో కాదు సన్ రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్ కూతురు కూడా.
ఇప్పటికే కొత్త ప్రాజెక్టులకు సంతకం చేశాడు చిన్న వయసు లోనే సాయి అభ్యాంకర్. తను ఇప్పుడు ఇంటర్నేషనల్ మూవీకి సంగీతం అందించబోతున్నట్లు , నిర్మాత ఓకే చెప్పినట్లు సామాజిక మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా థింక్ ఇండీ కోసం అభ్యాంకర్ స్వరపరిచిన తొలి స్వతంత్ర సింగిల్ “కచ్చి సెర” ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయ్యింది .
అంతే కాదు 2024 లో ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా సెర్చ్ చేసిన పాటలలో ఒకటిగా నిలిచింది. బెంజ్ కు సంగీతం సమకూర్చడానికి బక్కియరాజ్ కన్నన్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆ తర్వాత సూర్య 45 కి సంతకం చేశాడు . తన పేరెంట్స్ , సోదరి కూడా గాయనీ గాయకులు కావడం విశేషం. ఈ సందర్బంగా సాయి అభ్యాంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనలో సంగీతం, ఆధ్యాత్మికత సమపాళ్లలో ఉందన్నాడు.
Also Read : Hero Ajith-Good Bad Ugly :అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ రిలీజ్ కు రెడీ