Sa Re Ga Ma Pa: సరిగమప తెలుగు సీజన్‌ 16 కు ముహూర్తం ఫిక్స్‌ !

సరిగమప తెలుగు సీజన్‌ 16 కు ముహూర్తం ఫిక్స్‌ !

Sa Re Ga Ma Pa: చలనచిత్ర పరిశ్రమలో కీలక భాగమైన సంగీత పరిశ్రమ కోసం మట్టిలోని మాణిక్యాలను వెలికితీసే బుల్లి తెర కార్యక్రమాలు ఎన్ని వచ్చినా జీ తెలుగు వేదికగా ప్రసారం అయ్యే సరిగమప(Sa Re Ga Ma Pa) కు ప్రత్యేక స్థానం ఉంది. ఇప్పటికే 15 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ ట్యాలెంట్ షో ఇప్పుడు 16వ సీజన్ కు రెడీ అవుతోంది. అశేష ప్రేక్షకాదరణ పోందిన ప్రముఖ షో సరిగమప(Sa Re Ga Ma Pa) 16 వ సీజన్‌ ఈ నెల 29న ప్రారంభం కానుంది. ఈ సీజన్ కు ప్రముఖ సంగీత దర్శకులు కోటి, ప్రముఖ లిరిసిస్ట్‌ శ్యామ్‌ క్యాసర్ల, ప్రముఖ గాయని ఎస్పీ శైలజ లు జడ్జిగా వ్యవహారించనున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన ప్రారంభ కార్యక్రమంలో సరిగమప న్యాయనిర్ణేత, ప్రముఖ సంగీత దర్శకుడు కోటి ఆశక్తికరమైన వ్యాఖ్యలు చేసారు.

Sa Re Ga Ma Pa Season 16..

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ కోటి మాట్లాడుతూ… సంగీత పరిశ్రమలో ముద్రపడిపోయిన ట్రెండ్‌ లను అనుకరించడం కన్నా సృజనాత్మకతతో ఎప్పటికప్పుడు సరికొత్త ట్రెండ్‌లను సృష్టించేవారు చిరస్థాయిగా నిలిచిపోతారని కోటి తెలిపారు. దాదాపు 5 వేల మందిలో అత్యుత్తమ కళా నైపుణ్యాలున్న 26 మందిని ఎంపిక చేశామన్నారు. ప్రస్తుతం ఏఐ వంటి మాధ్యమాలు వచ్చి నకిలీ సంగీతాన్ని సృష్టిస్తున్నాయని, ఇలాంటి ఎన్ని సాంకేతికతలు వచ్చినా స్వచ్చమైన, సహజమైన నంగీతం ఎప్పుడూ తన ప్రశస్తిని పెంచుకుంటూ పోతుందన్నారు.

ఈ సందర్భంగా గీత రచయిత శ్యామ్ క్యాసర్ల మాట్లాడుతూ… మట్టిలో మాణిక్యాలను ప్రముఖ సింగర్లుగా వెలుగొందేలా సానబెడతామన్నారు. రెండు తరాలకు మధ్య వారధిలా సంగీత, సాహిత్య అభివృద్ధికి తోడ్పాటునందిస్తానని శ్యామ్‌ అన్నారు. ఈ సీజన్‌ లో విలేజ్‌ వోకల్స్‌, సిటీక్లాసిక్స్‌, మెట్రో మెలోడీస్‌ అనే 3 జట్లుగా పోటీలు కొనసాగుతాయని మరో జడ్జి ఎస్పీ శైలజ వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సింగర్లు రువంత్‌, రమ్య, అనుధీప్‌ తదితరులు పాల్గొన్నారు.

Also Read : Krishna Vamsi: పవన్‌ కల్యాణ్‌ ను యోగి ఆదిత్యానాథ్‌ తో పోల్చిన దర్శకుడు కృష్ణవంశీ !

Sa Re Ga Ma PaZee Telugu
Comments (0)
Add Comment