S S Rajamouli : మహేష్ బాబు, రాజమౌళి సినిమాపై మరో కీలక అప్డేట్

ఒక సింహం ఫొటో ముందు నిలబడి రాజమౌళి దిగిన పిక్ గురించి ఇప్పుడు అభిమానులు తెగ చర్చించుకుంటున్నారు...

S S Rajamouli : ఏ సినిమాకైనా కథే బలం. అందుకే మూవీ రిలీజ్ అయ్యే వరకు స్టోరీ ఏంటో రివీల్ కాకుండా జాగ్రత్త పడుతుంటారు మేకర్స్. కొందరు దర్శకులైతే స్టోరీ లైన్ ఏంటో రివీల్ చేసేందుకు కూడా ఇష్టపడరు. అయితే దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి(S S Rajamouli) మాత్రం దీనికి పూర్తి విభిన్నమనే చెప్పాలి. సినిమా సెట్స్ మీదకు వెళ్లకముందే కథ చెప్పేస్తాడు జక్కన్న. హీరోతో కలసి ప్రెస్ మీట్ పెట్టి మరీ తాము ఏం తీయబోతున్నామో వివరిస్తాడు. సినిమా కథ ఎలా సాగుతుంది, చిత్రం నుంచి ఏమేం ఆశించొచ్చో ముందే చెప్పేసి అందుకు తగ్గట్లుగా ఆడియెన్స్‌ను ప్రిపేర్ చేస్తాడు. కథ ఏంటనేది చెప్పినా కళ్లుచెదిరే విజువల్స్, అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్‌లు, సంభ్రమాశ్చర్యాలకు గురిచేసే గ్రాఫిక్స్‌, అద్భుతమైన మేకింగ్‌తో థియేటర్లకు వచ్చిన ప్రేక్షకుల్ని సీట్లకు కట్టిపడేస్తాడు రాజమౌళి.

S S Rajamouli Movie Updates

రాజమౌళి(S S Rajamouli)లా స్టోరీ ముందే చెప్పి ఆడియెన్స్‌ను బిగ్ స్క్రీన్స్‌కు రప్పించడం, ఒకవేళ వచ్చినా మూడు గంటల పాటు కళ్లు తిప్పుకోకుండా ఎంటర్‌టైన్ చేయడం అంత ఈజీ కాదు. అందుకే ఇతర దర్శకుల కంటే జక్కన్న ఎంతో స్పెషల్ అనే ముద్ర వేయించుకున్నాడు. వరుస పాన్ ఇండియా హిట్స్‌తో దూసుకెళ్తున్న దర్శకధీరుడు ఇప్పుడు సూపర్‌స్టార్ మహేష్ బాబు తో తెరకెక్కించనున్న SSMB29 చిత్రం పనుల్లో బిజీగా ఉన్నాడు. నిత్యం వార్తల్లో నిలుస్తున్న ఈ ప్రాజెక్ట్ గురించి రాజమౌళి(S S Rajamouli) ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చాడు. ఒక్క ఫొటోతో మూవీ కథ ఏంటో చెప్పేశాడు.

ఒక సింహం ఫొటో ముందు నిలబడి రాజమౌళి దిగిన పిక్ గురించి ఇప్పుడు అభిమానులు తెగ చర్చించుకుంటున్నారు. అంతగా ఆ ఫొటోలో ఏముందనేదేగా మీ సందేహం. అక్కడికే వస్తున్నాం.. దీని వెనుక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. ఈ లయన్ పేరు బాబ్ జూనియర్. సెరెంగెటీ నేషనల్ పార్క్‌లో తిరుగుతూ ఎంతో పాపులారిటీ తెచ్చుకుంది. అత్యంత ఆకర్షణీయమైన ఫొటో జెనిక్ ఫేస్ కలిగిన సింహంగా దీన్ని చెబుతుంటారు. అలాంటిది కొన్ని సింహాల చేతుల్లో ఈ బాబ్ జూనియర్ హత్యకు గురైంది. దీని తమ్ముడిగా భావించే ట్రైగ్వె అనే మరో లయన్ కూడా అదే ఘటనలో మరణించింది. ఇప్పుడు బాబ్ జూనియర్ ఫొటో ముందు నిలబడి జక్కన్న పిక్ దిగడం ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ బాబ్ జూనియర్ చనిపోయాక దాని ఆత్మ మహేష్ బాబును ఆవహిస్తుందని.. SSMB29 కథ అక్కడితో మొదలవుతుందని అంటున్నారు.

బాబ్ జూనియర్ హత్యకు కారణమైన వారి మీద మహేష్ ప్రతీకారం తీర్చుకుంటుండాట. దీంతో పాటు ఒక నిధికి సంబంధించిన వేట కీలకంగా SSMB29 స్టోరీ సాగుతుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో నిజనిజాలు ఎంతనేది మూవీ టీమ్‌కే తెలియాలి. అయితే ప్రతీకారం, నిధి అన్వేషణతో సాగే కథ అంటూ వినిపిస్తున్న రూమర్స్ మాత్రం సినిమా గురించి మళ్లీ చర్చలు జోరందుకునేలా చేశాయి. అసలు స్టోరీ ఏంటనేది రాజమౌళి క్లారిటీ ఇస్తే గానీ తెలియదు.

Also Read : AP Dhillon : ప్రముఖ పంజాబీ గాయకుడి ఇంటి పై కాల్పులు

MoviesSS RajamouliSSMB29TrendingUpdatesViral
Comments (0)
Add Comment