Rythu Bidda Prasanth : బర్రెలక్కకు బిగ్ బాస్ రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ కు పెళ్లా..?

తన పెళ్లి వార్తలపై బర్రెలక్క స్పందించింది

Rythu Bidda Prasanth : బర్రెలక్క-రైతు బిడ్డా.. ఈ ఇద్దరి గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు ఉంటారా? ఒకరు పొలిటికల్ గా క్రేజ్ తెచ్చుకుంటే , మరొకరు టీవీషోల ద్వారా పాపులర్ అయ్యారు. మొదట, బర్రెలక్క గురించి మాట్లాడుకుందాం. శిరీష అనే బర్రెలక్క తాను డిగ్రీ చేసానని ఐనా ఉద్యోగం రాలేదని అందుకే బర్రెల్నికాస్తున్న అంటూ ఒక వీడియో పోస్ట్ చేసింది. ఇక చూసుకోండి సోషల్ మీడియా సంగతి తెలిసిందేగా. ఈ వీడియో కేవలం కొన్ని సెకన్లలో వైరల్‌గా మారింది. బర్రెలక్క ఫ్యాన్స్ సంఖ్య పెరిగింది. ఇంకా అదే క్రేజ్ తో రాజకీయ ప్రవేశం కూడా చేసింది. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పాల్గొంది. జెడి లక్ష్మీనారాయణ, మల్లాది కృష్ణారావులు తమవంతు సహాయ సహకారాలు అందించి ఆర్థిక సహాయాన్ని అందించారు. దురదృష్టవశాత్తు, తక్కువ అనుభవం ఉన్న బర్రెలక్కకి 5,000 ఓట్లు మాత్రమే వచ్చాయి.

Rythu Bidda Prasanth and Barrelakka Marriage News Viral

అయితే ఇప్పుడు బర్రెలక్క పెళ్లి చేసుకోబోతోందనే వార్త ప్రచారంలోకి వచ్చింది. వరుడు మరెవరో కాదు మా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ అంటూ చెప్తున్నారు. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వేగంగా వ్యాపించింది. అయితే అంతటితో ఆగలేదు మరికొందరు ఇంకో అడుగు ముందుకేసి వీరిద్దరికీ ఇప్పటికే పెళ్లయిపోయిందంటూ పుకార్లు పుట్టించారు. పల్లవి ప్రశాంత్, రైతు బిడ్డ, బిగ్ బాస్(Big Boss) పుణ్యమా అని అతనికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. అతను విజేతగా కూడా నిలిచాడు. అన్నా..అన్నా.. అంటూ వీడియోలు చేసి ఫేమస్ అయిన ప్రశాంత్ కు బర్రెలక్కతో(Barrelakka) పెళ్లి అంటూ కొందరు సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు.

తన పెళ్లి వార్తలపై బర్రెలక్క స్పందించింది. నేను “బిగ్ బాస్` సిరీస్ చూడను. నేను ఎపిసోడ్ 2 చూశాను. ప్రచార బిజీలో దాన్ని పక్కన పెట్టేశాను. నేను లాస్ట్ చివరి ఎపిసోడ్‌ని చూశాను. నేను అతనికి ఎప్పుడూ ఫోన్ కూడా చేయలేదు. అతను నన్ను పెళ్లి చేసుకున్నాడని వార్తలు వచ్చాయి. కొంతమంది యూట్యూబ్‌లో మా పెళ్లికూడా చేశారు. పెళ్లికి పెద్ద పెద్ద స్టార్లు కూడా వచ్చినట్లు వీడియోలు చేసారని బర్రెలక్క చెప్పుకొచ్చింది. సోషల్ మీడియాలో లైక్స్ మరియు వ్యూస్ కోసం మీరు ఇంతలా దిగజారతారా? ఇజ్జత్ తీస్తారా? ఎవరి జీవితం నాశనమైనా పట్టింపు లేదా? ఇలాంటి తప్పుడు నివేదికను ఎలా పుట్టిస్తారు? నేను చాలా వీడియోలలో ప్రశాంత్ ని అన్న అని పిలిచాను. అలాంటిది నాకు అతనికి పెళ్లి అంటూ తప్పుడు వార్తలు ఎలా సృష్టిస్తారు అని బర్రెలక్క ఫైర్ అయింది.

Also Read : Arbaaz Khan : కొత్త కథతో టాలీవుడ్ లో అడుగుపెడుతున్న సల్మాన్ సోదరుడు

BreakingCommentsTrendingUpdatesViral
Comments (0)
Add Comment