Ruhani Sharma: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా ప్రముఖ యాడ్ ఫిల్మ్ మేకర్ శక్తి ప్రతాప్ సింగ్ హడా తెరకెక్కించిన చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్, రినైసన్స్ పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ బై లింగ్యువల్ ప్రాజెక్ట్ లో వరుణ్ తేజ్ ఫైటర్ పైలట్‌గా నటిస్తుండగా.. మానుషి చిల్లర్ రాడార్ ఆఫీసర్‌గా కనిపించనుంది. ‘నిజమైన సంఘటనల నుంచి ప్రేరణ పొంది భారత వైమానిక దళ వీరుల అసమానమైన ధైర్య సాహసాల్ని, దేశాన్ని రక్షించడంలో వారు ఎదుర్కొంటున్న సవాళ్లను తెరపై ఆవిష్కరించే విధంగా దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ‘ఆపరేషన్ వాలెంటైన్’ ను మార్చి 1 న తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న రుహాని శర్మ(Ruhani Sharma) ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
Ruhani Sharma Movie Updates
సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్ నుండి విడుదలై విజయవంతమైన సినిమా ‘మేజర్’. ‘మేజర్’ తర్వాత మరొక దేశభక్తి అడ్రినలిన్ పంపింగ్ థ్రిల్లర్ గా ‘ఆపరేషన్ వాలెంటైన్’ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై భారీగా అంచనాలున్నాయి. అయితే ఈ సినిమాలో తాన్య శర్మ అనే ఎయిర్ ఫోర్స్ పైలట్ గా రుహానీ శర్మ ఓ కీలక పాత్రలో కనిపించనుంది. దీనితో ఈ సినిమాకు సంబంధించి రుహాని శర్మకు పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ప్రస్తుతం రుహానీ శర్మ ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
Also Read : Rajinikanth Movies : లాల్ సలామ్ తర్వాత వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న తలైవా