RS 500 Crore Club Movies : భారతీయ సినిమా ప్రస్తుతం వెలిగి పోతోంది. ఊహించని మార్కెట్ ను స్వంతం చేసుకుని వసూళ్ల సునామీ సృష్టిస్తున్నాయి. విడుదలైన కొన్ని రోజుల్లోనే రికార్డులను బ్రేక్ చేసిన సినిమాలు చాలా ఉన్నాయి. తాజాగా తమిళనాడు సూపర్ స్టార్ తలైవా రజనీకాంత్ నటించిన జైలర్(Jailer) బాక్సులు బద్దలు కొడుతోంది.
RS 500 Crore Club Movies Viral
రిలీజైన వెంటనే రూ. 500 కోట్ల క్లబ్ లోకి పలు సినిమాలు చేరాయి. వాటిలో బాలీవుడ్ కు సంబంధించి చూస్తే సల్మాన్ ఖాన్ నటించిన దంగల్ , షారుక్ ఖాన్ నటించిన పఠాన్ , సల్మాన్ నటించిన బజరంగీ భాయిజాన్ ఉంది.
వీటితో పాటు సీక్రెట్ సూపర్ స్టార్ , పీకే, సుల్తాన్ , సంజు, పద్మావత్, టైగర్ జిందా హై , ధూమ్ -3, గదర్ -2 మూవీస్ ఉన్నాయి.
ఇక కోలీవుడ్ పరంగా చూస్తే పాయిట్ -0 , రజనీ జైలర్ , మణిరత్నం తీసిన పొన్నియిన్ సెల్వన్ చిత్రాలు రూ. 500 కోట్లు దాటేశాయి. టాలీవుడ్ లో బాహుబలి -2 , ఆర్ఆర్ఆర్ చిత్రం, బాహు బలి -1 ఐదు వందల క్లబ్ లో చేరాయి. శాండిల్ వుడ్ లో యశ్ నటించిన కేజీఎఫ్ చాప్టర్ 2 మూవీ నిలిచింది.
ఈ సినిమాలు సక్సెస్ కావడానికి ప్రధానంగా దర్శకులతో పాటు హీరోల ఇమేజ్ కూడా తోడ్పడిందని చెప్పక తప్పదు. ఇక ఒక్కో దర్శకుడిది ఒక్కో టేస్ట్. టేకింగ్, మేకింగ్ లో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నారు దర్శకులు. అందుకే కోట్లు కొల్లగొట్టేలా చేశారు.
Also Read : Kodali Nani : మెగాస్టార్ బర్త్ డే వేడుకల్లో కొడాలి నాని